Home Cinema శ్రీరెడ్డి డైరీలో అస‌లు సీక్రెట్స్ లీక్

శ్రీరెడ్డి డైరీలో అస‌లు సీక్రెట్స్ లీక్

శ్రీరెడ్డి బ‌యోపిక్ అట‌కెక్కిందా?

సోష‌ల్ మీడియా స్టార్ శ్రీరెడ్డి చ‌ల్ల‌బ‌డిపోయింది. ఎంత వేగంగా పాపుల‌ర్ అయిందో అంతే వేగంగా కింద‌కి ప‌డిపోయింది. ఆమె పోస్టుల‌కు వెయిట్ త‌గ్గిపోవ‌డంతో ఇటీవ‌ల‌ సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటోంది. అప్పుడ‌ప్పుడు కాంట్ర‌వ‌ర్శీల‌తో ఉనికి చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నా ఎందుక‌నో వ‌ర్క‌వుట్ అవ్వ‌డం లేదు. ఆ విష‌యాలు ప‌క్క‌న‌బెడితే త‌మిళ్ లో ఈ అమ్మ‌డి బ‌యోపిక్ ను `రెడ్డి డైరీ`  టైటిల్ తో అప్ప‌ట్లో ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. తెలుగు లో కూడా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. సినిమా ఇండస్ట్రీకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆమె స్ట్ర‌గుల్స్.. ఎఫైర్లు, `మా `అసోసియేష‌న్ మెంబ‌ర్ షిప్  పై చేసిన పోరాటాన్ని హైలైట్ చేస్తూ దీన్ని తెర‌కెక్కిస్తున్నట్లు తెలిపింది.

అయితే ఈ సినిమా ప్రారంభ‌మై ఆరు నెల‌ల‌కు పైగానే గ‌డుస్తోంది. కానీ ప్రారంభ‌మైన నాటి నుంచి నేటి వ‌ర‌కూ మ‌రో అప్ డేట్ అన్న‌దే రాలేదు. కోలీవుడ్ మీడియా లో కూడా  ఈసినిమాను పెట్టించుకున్న‌ట్లు లేదు. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ మీడియా ఈ వ్య‌వ‌హారంపై దృష్టి సారించింది. ఈ సినిమా అప్ డేట్స్ లేని నేప‌థ్యంలో సినిమా ఉందా.. లేదా?  పూర్తిగా అట‌కెక్కిందా? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదేమి భారీ బ‌డ్జెట్ సినిమా కాదు. నెల‌లు త‌ర‌బ‌డి తీయాల్సినది అస‌లే కాదు. మ‌రి ఆల‌స్యం ఎందుకు అన్న కోణంలో ఆరా తీయ‌గా ఈ ప్రాజెక్ట్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింద‌నే ప్రచారం సాగుతోంది. శ్రీరెడ్డి కూడా అప్పుడ‌ప్పుడు త‌న ప్ర‌చారానికి సంబంధించిన పోస్టులు పెడుతుంది కానీ త‌న బ‌యోపిక్ అప్ డేట్స్ అడిగితే ఎస్కేప్ అయ్యే ప్ర‌య‌త్నం చేస్తోంది. దీంతో ఆగిపోయింద‌నే  రూమ‌ర్ నే ఖ‌రారు చేసుకోవాల్సి వ‌స్తోంది. మ‌రి వీటికి శ్రీరెడ్డి పుల్ స్టాప్ పెడుతుందేమో చూడాలి.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ