fbpx
Home Cinema ఫ్యామిలీమ్యాన్ పాలిట రాకాశి

ఫ్యామిలీమ్యాన్ పాలిట రాకాశి

చైతూతో పెళ్లి త‌రువాత స‌మంత క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కు కొత్త మెరుగులు అద్దుతూ కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. క‌థ‌తో పాటు పాత్రకు ప్రాధాన్యం వున్న చిత్రాల్నే ఎంచుకుంటూ కెరీర్‌ని ప‌రుగులు పెట్టిస్తోంది. సినిమాల ప‌రంగా, పాత్ర‌ల ప‌రంగా త‌న టేస్ట్ ఏంటో నిరూపించుకుంటూ వ‌రుసగా విభిన్న‌మైన చిత్రాల్ని ఎంచుకుంటోంది. కొత్త త‌ర‌హా క‌థ‌ల‌తో పాటు వెబ్ సిరీస్‌ల‌పై కూడా క‌న్నేసింది. ప్ర‌స్తుతం వెబ్ దునియా సినిమాని డిమినేట్ చేస్తూ విస్త‌రిస్తోంది. దానికి అనుగుణంగానే స‌మంత ప్లాన్ చేసుకుంటూ తెలివిగా అడుగులు వేస్తోంది.

డిజిట‌ల్ ప్ర‌పంచం రానున్న రోజుల్లో భారీ స్థాయిలో విస్త‌రించ‌బోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు వేపుగా వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌, య‌ప్ టీవీ, వీ6, ఓ టీటీ వంటి ప్లాట్ ఫామ్స్ ఇప్ప‌టికే వెబ్ సిరీస్‌ల‌తో దూసుకుపోతున్నాయి. హాలీవుడ్‌, బాలీవుడ్ కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన నెట్‌ఫ్లిక్స్ కూడా బాలీవుడ్‌, టాలీవుడ్‌ల‌లోకి చొచ్చుకురావ‌డంతో అటు వైపుగా రైట‌ర్‌ల‌కు, క్రియేట‌ర్ల‌కు అవ‌కాశాలు భారీ స్థాయిలో పెరిగాయి. భ‌విష్య‌త్తు వెబ్ సిరీస్‌ల‌దే అని తెలుస్తుండ‌టం, అందుకు అనుగుణంగా వాతావ‌ర‌ణం మారుతుండ‌టంతో స్టార్‌లు వెబ్ సిరీస్‌ల బాట‌పడుతున్నారు. ఇప్ప‌టికే కాజ‌ల్ కూడా వెబ్ ప్ర‌పంచంలోకి అడుగుపెడుతుండ‌టంతో స‌మంత కూడా ఎంట‌ర‌వ్వ‌డానికి సై అంటూ సిగ్న‌ల్ ఇచ్చేసింది.

ఇటీవ‌లే మ‌నోజ్ బాజ్‌పాయ్ న‌టిస్తున్న ఫ్యామిలీమ్యాన్‌-2కు ఓకే చెప్పేసింది. డీ ఫ‌ర్ దోపిడీ ఫేమ్ రాజ్ ఎన్ డీకే ద్వ‌యం ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ వెబ్ సిరీస్ త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌బోతోంది. తొలి భాగానికి మంచి రెస్పాన్స్ రావ‌డంతో రెండ‌వ భాగంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దానికి త‌గ్గ‌ట్టే స‌మంత‌ని కీల‌క పాత్ర కోసం తీసుకున్నారు. ఇందులో స‌మంత ఫైట్స్ కూడా చేయ‌బోతోంద‌ట‌. పైగా త‌న గెట‌ప్ కూడా మార్చు కోవాలి కాబ‌ట్టి అందుకు సంబంధించిన క‌స‌ర‌త్తులు ఇప్ప‌టికే అక్కినేని వారి కోడ‌లు మొద‌లుపెట్టిన‌ట్టు చెబుతున్నారు. ఆ కార‌ణంగానే స‌మంత తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాలు అంగీకిరించ‌డం లేదు. 96 స‌మంత పార్ట్ ముగించి.. ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ కోసం సిద్ధ‌మ‌వుతోంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ