fbpx
Home Cinema సమంత గర్భం విషయంపై స్పందిస్తారా?

సమంత గర్భం విషయంపై స్పందిస్తారా?

పాకెట్‌ మనీ కోసం చిన్నచిన్న వేడుకల్లో సహాయ కార్యక్రమాలు చేస్తూ నటిగా మారింది ఈ బ్యూటీ. బానాకాత్తాడి చిత్రంతో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసినా, తెలుగులో నటించిన ఏ మాయచేసావే చిత్రంతో విజయాన్ని అందుకుంది.సినిమా విషయాలను పక్కన పెడితే సమంత తెలుగులో తొలి హీరో నాగచైతన్యనే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా సమంత గర్భం దాల్చినట్లు, దీంతో నటనకు సుమారు ఒకటిన్న ఏడాది బ్రేక్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.సినిమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్న సమంత కొత్త చిత్రాలను అంగీకరించడం లేదనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం నటిస్తున్న 96 చిత్రం తరువాత మరో చిత్రాన్ని అంగీకరించలేదన్నది వాస్తవమే.ఇకపై ఆ తరహా వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించాలనుకుంటున్నట్లు ఈ భామ ఇటీవలే తెలిపారు. అలాంటిది పిల్లలను కనాలనే ఆలోచనను సమంత ఇంత త్వరగా తీసుకుంటారని ఊహించలేం కూడా. వదంతులను ఎంజాయ్‌ చేసే సమంత తన గర్భం దాల్చాననే ఈ విషయంపై వెంటనే స్పందిస్తారా అనేది వేచి చూడాలి.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}