fbpx
Home Cinema స‌ల్మాన్ వారం ఫీజు 31 కోట్లు

స‌ల్మాన్ వారం ఫీజు 31 కోట్లు

బుల్లితెర హోస్ట్ వారం ఫీజు 31కోట్లు

బుల్లితెర‌పై `బిగ్ బాస్` సంద‌డి మామూలుగా లేదు. ఇండియాని ఫారిన్ కంటే అడ్వాన్స్ డ్ గా త‌యారు చేస్తోంది బిగ్ బాస్. హిందీ, తెలుగు, త‌మిళం స‌హా అన్ని భాషాల్లోనూ బిగ్ బాస్ చాప చుట్టేస్తోంది. ఈ రియాలిటీ షో పాపులారిటీని పెంచే దిశ‌గా స్టార్ చానెల్ చేయ‌ని ప్ర‌య‌త్న‌మే లేదు. అన్ని రాష్ట్రాల్లోనూ బిగ్ బాస్ జోష్‌ మామూలుగా లేదు. బిగ్ బాస్ స‌మాజానికి మేలు చేస్తోందా కీడు చేస్తోందా? అన్న‌ది అటుంచితే ఈ రియాలిటీ షో పేరుతో హోస్టింగ్ చేస్తున్న స్టార్లు మాత్రం భారీగా ఆర్జిస్తున్నారు.

ఇంత‌కుముందు తెలుగు బిగ్ బాస్-సీజ‌న్1 కి హోస్టింగ్ చేసిన ఎన్టీఆర్ కి 16 కోట్ల మేర పారితోషికం ముట్ట‌జెప్పార‌ని ప్ర‌చార‌మైంది. ఆ త‌ర్వాత సీజ‌న్ 2కి నానీకి 8కోట్ల మేర ఇచ్చార‌ని ముచ్చ‌టించుకున్నారు. ప్ర‌స్తుతం కింగ్ నాగార్జున‌కు 10కోట్లు పైగానే ముడుతోంద‌ట‌. ఇదిలా ఉంటే త్వ‌ర‌లో ప్రారంభం కానున్న‌ హిందీ బిగ్ బాస్ హోస్ట్ స‌ల్మాన్ ఖాన్ కి ఏకంగా 400 కోట్ల మేర ముడుతోంద‌ని తెలుస్తోంది. హిందీ బిగ్ బాస్ కి హోస్టింగ్ చేస్తున్నందుకు అత‌డికి వారానికి 31 కోట్ల పారితోషికం ముట్ట‌జెబుతున్నార‌ట‌.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ