Home Cinema సల్మాన్ సినిమా కోసం అమీర్‌ను కాదంది

సల్మాన్ సినిమా కోసం అమీర్‌ను కాదంది

బాలీవుడ్‌లో ఖాన్ త్రయం(సల్మాన్, షారూఖ్, అమీర్) గురించి, వారి స్టార్‌డమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో అడుగుపట్టిన, పెట్టాలనుకునే ప్రతీ హీరోయిన్ కల వారితో నటించడం. అలాంటిది మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సినిమాను వదులుకుంది హాట్ బ్యూటీ ఆలియా భట్. కారణాలను ఆలియా వివరిస్తూ.. అమీర్ సినిమాను వదులుకోవడం చాలా నిరాశ పర్చింది. ఎందుకంటే ఆయన సినిమాకు ముందు సల్మాన్‌ఖాన్‌తో ఇన్షా అల్లా అనే సినిమాకు సైన్ చేశా. డేట్స్ అన్నీ ఆ సినిమాకే కేటాయించడంతో అమీర్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. ఇలాంటి సిచ్యువేషన్‌లోనే ఆయన సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. అలాగే అదే సమయంలో సల్మాన్‌తో సినిమా చేయడం చాలా ఆనందంగానూ ఉంది.

ఇన్షా అల్లా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లో చేయడం చాలా అరుదు, సంతోషం కూడా అని ఆమె అన్నారు. ఇంతకు ముందు ఆలియా షారూఖ్ ఖాన్‌తో డియర్ జిందగీ అనే సినిమాలో నటించింది. కాగా, వచ్చే మంగళవారం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వళ్లనుందని సల్మాన్ ట్వీట్ చేశాడు. వచ్చే ఏడాది రంజాన్‌కు ఈ సినిమా విడుదల కానుంది.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ