fbpx
Home Cinema సాయిధ‌ర‌మ్ `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్`

సాయిధ‌ర‌మ్ `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్`

మెగా మేన‌ల్లుడు సాయిధ‌రమ్ చిత్రల‌హ‌రి డీసెంట్ విజ‌యం సాధించ‌డంతో కెరీర్ ప‌రంగా బౌన్స్ బాక్ అయ్యాడు. వ‌రుస అప‌జ‌యాల న‌డుమ చిత్రలహ‌రి ఊర‌ట‌నిచ్చింది. ఆ విజ‌యం ఇచ్చిన ఉత్సాహంలో సాయిధ‌ర‌మ్ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తి రోజు పండ‌గే చిత్రంలో న‌టిస్తున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుగుతోంది. అన్ని ప‌నులు పూర్తిచేసి క్రిస్ట‌మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్నారు.
 
తాజాగా సాయిధ‌ర‌మ్ త‌న  కొత్త సినిమా టైటిల్ ను కూడా ప్ర‌క‌టించారు. సుబ్బు అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నారు.  ద‌స‌రా సంద‌ర్భంగా ఆ సినిమా టైటిల్ పోస్ట‌ర్ రివీల్ చేసారు. సోలో బ‌తుకే సో బెట‌ర్ అన్న ఇంప్రెసివ్ టైటిల్ తో ముందుకొస్తున్నాడు. టైటిల్  క్యాచీగా ఉంది. టైటిల్ ను బ‌ట్టి ల‌వ్ లో ఫెయిలైన ప్రేమికుడి గాథ‌ను చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో న‌భా న‌టేష్ హీరోయిన్ గా న‌టిస్తోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ప‌తాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.
 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ