Home Cinema సాహో వ‌సూళ్ల‌లో అనూహ్యం.. ఇది ఊహించ‌నిది!

సాహో వ‌సూళ్ల‌లో అనూహ్యం.. ఇది ఊహించ‌నిది!

60 శాతం వ‌సూళ్లు త‌గ్గితే క‌ష్ట‌మేనేమో!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా తొలి వీకెండ్ సాహో వ‌సూళ్ల హవా సాగింది. ఇప్ప‌టికే ఈ సినిమా స‌గం పైగా నెట్ వ‌సూళ్ల‌ను సాధించి పెట్టిన పెట్టుబ‌డి నుంచి ఆ మేర‌కు కాన్ఫిడెన్స్ నిచ్చింది. అయితే సోమ‌వారం, మంగ‌ళ‌వారం నుంచే అస‌లు క‌థ మొద‌లైంద‌ని చెబుతున్నారు. ట్రేడ్ టాక్ ప్ర‌కారం.. సోమ‌వారం, మంగ‌ళ‌వారం నాన్ హాలీడేస్ కాబ‌ట్టి 50-60 శాతం ఆక్యుపెన్సీలో త‌గ్గుద‌ల‌ క‌నిపించింద‌ని చెబుతున్నారు. అంటే థియేట‌ర్ల‌లో స‌గం మంది మాత్ర‌మే క‌నిపిస్తున్నార‌న్న‌మాట‌.

అయితే ఇది మునుముందు ఇంకా పెరిగితేనే పూర్తి స్థాయిలో బ‌య్య‌ర్లు రిక‌వ‌రి అయ్యే ఛాన్సుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. తొలి 10 రోజులు సాహో స్ట‌డీగా క‌లెక్ట్ చేస్తేనే చాలా ఏరియాల్లో పంపిణీదారులు సేఫ్ అవుతార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ నైజాంలో వ‌సూళ్లు అద‌ర‌గొట్టింద‌న్న టాక్ ఉన్నా అక్క‌డా సోమ మంగ‌ళ‌వారానికి 50 శాతం త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. సీడెడ్ లో ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా లేద‌ని తెలుస్తోంది. అక్క‌డ తొలి నుంచి వ‌సూళ్లు అంత‌గా లేవు. ఇప్పుడు మ‌రీ త‌గ్గాయ‌ట‌. ఒకే ఒక్క హిందీ ప‌రిశ్ర‌మ‌లో మాత్రం సాహో వ‌సూళ్ల‌కు ఎదురే లేదు. ఇప్ప‌టికే 110 కోట్ల మేర నెట్ వ‌సూలు చేయ‌డం అక్క‌డ పెద్ద ఊర‌ట‌. అలాగే త‌మిళ‌నాడులో క‌లెక్ష‌న్లు అంత బాలేదు. క‌ర్నాట‌క లో మాత్రం అద్బుత విజ‌యం సాధించింద‌ని రిపోర్ట్ అందింది. దాదాపు 300 కోట్ల మేర పెట్టుబ‌డులు పెట్టి ఆ మేర‌కు థియేట్రిక‌ల్ బిజినెస్ పూర్తి చేశారు కాబ‌ట్టి అదంతా రిక‌వ‌రీ కావాల్సి ఉంటుంది.

తాగిందంతా దిగింది పైగా 100 బొక్క‌

కొన్ని ఏరియాల పంపిణీదారులు సేఫ్ అయినా చాలా ఏరియాల్లో పంపిణీదారులు భారీ మొత్తాల్ని పెట్టి రైట్స్ కొనుక్కున్న వారికి న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని అంచ‌నా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్ స‌హా త‌మిళ‌నాడులో వ‌సూళ్లు ఆశాజ‌న‌కంగా లేవ‌ని చెప్పుకుంటున్నారు. అయితే ఓవ‌రాల్ గా వ‌సూళ్లు ద‌క్కుతున్నాయి కాబ‌ట్టి న‌ష్ట‌పోయిన పంపిణీదారుల‌కు ఆ మొత్తాల్ని భ‌ర్తీ చేసేందుకు యు.వి.క్రియేష‌న్స్ ప్ర‌య‌త్నిస్తోంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. తాగిందంతా దిగింది పైగా వంద‌ బొక్క‌! అంటూ ఓ మాస్ ఆడియెన్ రివ్యూ చెబితే.. చాలా బావుంది అని చెబుతున్న అభిమానులు ఉన్నారు. ఈ త‌ర‌హా మిశ్ర‌మ స్పంద‌న‌ల న‌డుమ సాహో ఇంకా ఏ మేర‌కు వ‌సూలు చేస్తుందో చూడాలి.

Featured Posts

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

All cardholders will get ration

Lambasting TDP party for playing cheap politics during the tough time of COVID 19 pandemic, Minister's for Civil Supplies Kodali Venkateswara Rao (Nani) emphasized...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

ప్రేమ గువ్వ‌లు విడిపోలేదు.. డిసెంబ‌ర్ లో పెళ్లి బాజా!!

ర‌ణ‌బీర్ క‌పూర్-ఆలియా భ‌ట్ జంట‌ ప్రేమ‌...పెళ్లి వ్య‌వ‌హారంపై నిత్యం క‌థ‌నాలు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట బ్రేక‌ప్ అయింద‌ని కొంద‌రంటే... ఇప్ప‌టికే సీక్రెట్ పెళ్లి అయిపోయింద‌ని మ‌రికొంద‌రు.. ఇంకొంత మంది పెళ్లికి...

దాడి చేసిన వాళ్ల‌పై గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ వీరంగం!

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లో టెన్ష‌న్ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇక ఇలాంటి ప్ర‌మాద‌క‌ర స‌న్నివేశంలో డాక్ట‌ర్లు.. మెడికోలు.. ఆశా వ‌ర్క‌ర్లు.. ఎన్జీవోలు త‌మ ప్రాణాల‌కు తెగించి కొవిడ్-19 వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స అందిస్తున్న...

క‌ష్టాల్లో నేచుర‌ల్ స్టార్ నాని!

టాలీవుడ్‌లో వున్న మినిమ‌మ్ గ్యారెంటీ హీరో నేచుర‌ల్ స్టార్ నాని. ఈ హీరో ప్ర‌స్తుతం క‌ష్టాల్లో వున్నాడు. ఇటీవ‌ల `జెర్సీ` చిత్రంతో హిట్‌ని సొంతం చేసుకున్నా ఆ త‌రువాత వ‌చ్చిన `గ్యాంగ్ లీడ‌ర్‌`...

చిరంజీవి చిత్రానికి మ‌రో షాక్‌!

కొన్ని సినిమాలు ఎప్పుడు ప్రారంభించారో ఎప్పుడు పూర్తి చేశారో ఎవ‌రికీ తెలియ‌దు. అంత సైలేంట్‌గా పూర్తియిపోతుంటాయి. కానీ కొన్ని మాత్రం నిత్యం ఏదో ఒక వివాదంతో ప్రారంభం నుంచి వార్త‌ల్లో నిలుస్తుంటాయి. ప్ర‌స్తుతం...

సీసీసీ నిధికి చేరిన 6 కోట్లు కార్మికుల అకౌంట్లోకి!

మెగాస్టార్ చిరంజీవి చైర్మ‌న్‌గా ఏర్పాటు చేసిన సీసీసీ (క‌రోనా క్రైసిస్ చారిటీ)కి ఇప్ప‌టి వ‌ర‌కు 6 కోట్ల‌కు మించి విరాళాలు అందాయి. చిరు, నాగ్‌, ప్ర‌భాస్‌, రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్‌, ద‌గ్గుబాటి ఫ్యామిలీ.....

రాజ‌మౌళి మ‌ళ్లీ దొరికిపోయాడా?

ద‌ర్శ‌క‌ధీర అంటూ జేజేలందుకుంటున్న రాజ‌మౌళి మ‌ళ్లీ దొరికిపోయాడా? అంటే అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. జ‌క్క‌న్న తీస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` ఓ హాలీవుడ్ చిత్రానికి కాపీ అని తెలిసింది. `స్టూడెంట్ నెం.1`...

క‌రోనా సినిమాలు చూడొచ్చు క‌దా శేష్‌?

టైమ్ చూసి టైమ్ బాంబ్ లా ఏదో ఒక కొత్త‌ద‌నం ఉన్న సినిమాతో అభిమానుల ముందుకు రావ‌డం గూఢ‌చారి హీరో శేష్ ప్ర‌త్యేక‌త‌. ఇంత‌కుముందు గూఢ‌చారి అలాంటి సినిమానే. ఉన్న‌ట్టుండి ప‌రిమిత బ‌డ్జెట్...

ఇంట్లో క్వారంటైన్ అని చెప్పి కుర్ర‌హీరోతో బెడ్ రూమ్‌లో

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని లాక్ డౌన్ చేసిన సంగ‌తి తెలిసిందే. అగ్ర రాజ్యం పేద రాజ్యం అనే తేడా లేకుండా అన్నిటినీ చుట్ట‌బెట్టేసింది. ఈ స‌మ‌యంలో సెల‌బ్రిటీ ప్ర‌పంచం.. సామాన్య ప్ర‌జ‌లు అనే...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

వైట్ల వ‌ర్సెస్ కోన‌: క‌త్తుల‌తో పొడుచుకునేంత లేదు కానీ!

దర్శ‌కుడు శ్రీనువైట్ల‌-రైట‌ర్ కొన వెంక‌ట్ జోడీ సూప‌ర్ స‌క్సెస్ ల గురించి తెలిసిందే. ఈ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `ఢీ`..`రెడీ`.. `దూకుడు`..`బాద్ షా` బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు సాధించాయి. ఈ విజ‌యాల‌తోనే శ్రీ‌ను...