Home Cinema సాహో మొద‌టి రోజు వ‌సూళ్లతో ఆ రికార్డుల‌న్నీ బ్రేక్!

సాహో మొద‌టి రోజు వ‌సూళ్లతో ఆ రికార్డుల‌న్నీ బ్రేక్!

అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ రికార్డులు బ్రేక్

ప్ర‌భాస్ `సాహో` చిత్రం మొద‌టి రోజు ఎంత వ‌సూలు చేయ‌నుంది? అంటే ట్రేడ్ అంచ‌నా ప్ర‌కారం.. ఈ సినిమా ఇప్ప‌టికే నంబ‌ర్ 2 స్థానం ఖాయం చేసుకుంద‌ని తెలుస్తోంది. ఓవ‌రాల్ గా 100 కోట్లు వ‌సూలు చేయ‌డం ఖాయం అన్నది ఓ అంచ‌నా. తెలుగు రాష్ట్రాల్లో 35కోట్లు, హిందీలో 30కోట్లు, త‌మిళం -15కోట్లు, మ‌ల‌యాళం-3-5 కోట్లు వ‌సూలు చేయ‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఓవ‌ర్సీస్ నుంచి మ‌రో 13 కోట్లు (2 మిలియ‌న్ డాల‌ర్లు) వ‌సూలు చేయ‌నుందని చెబుతున్నారు.

బాహుబ‌లి 2 రికార్డుని కొట్టేయ‌క‌పోయినా.. సాహో ఇంచుమించు ద‌గ్గ‌ర‌లోనే ఉంటుందన్న‌ది ట్రేడ్ అంచ‌నా. డే వ‌న్ లో భార‌త‌దేశంలో నెట్ వ‌సూళ్లు చూస్తే.. బాహుబ‌లి 2- 124 కోట్ల, 2.0 – 59 కోట్లు, అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్- 53.10 కోట్లు, థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్- 52.25 కోట్లు, క‌బాలి-47.4 కోట్లు వ‌సూలు చేశాయి. అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ రికార్డును కొట్టేసి సాహో రెండో స్థానం ఇప్ప‌టికే ఖాయం చేసుకుంది. అయితే నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ద‌క్కించుకుంటుందా? అన్న‌దే ఇంకా స‌స్పెన్స్. కేవ‌లం తెలుగు రాష్ట్రాల లెక్క‌లు ప‌రిశీలిస్తే.. బాహుబ‌లి 2 – 42.47 కోట్లు, అజ్ఞాత‌వాసి- 27 కోట్లు, అర‌వింద స‌మేత -26 కోట్లు వ‌సూలు చేశాయి. ఆ లెక్క‌న తెలుగు రాష్ట్రాల్లోనూ బాహుబ‌లి 2 త‌ర్వాతి స్థానం సాహోకి ద‌క్క‌నుంద‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు ట్రేడ్ వ‌ర్గాలు ర‌క‌ర‌కాల మార్గాల్లో లెక్క‌లు తేల్చాయి.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ