fbpx
Home Cinema RRR టైటిల్ ఇదేనంటూ టెస్టింగా!

RRR టైటిల్ ఇదేనంటూ టెస్టింగా!

RRR టైటిల్.. ఇదా సంగ‌తి?

బాహుబ‌లి లాంటి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ తో ప్ర‌పంచం దృష్టిని త‌మ ప్రాజెక్టు వైపు తిప్పేసుకున్నారు రాజ‌మౌళి అండ్ ఆర్కా టీమ్. ఒక సినిమాకి టైటిల్ ఎంత ముఖ్య‌మో ఆ సంద‌ర్భం చెప్పింది. జాతీయ అంత‌ర్జాతీయ ఆడియెన్ కి బాహుబ‌లి ఎంతో గొప్ప‌గా క‌నెక్ట‌య్యింది. ఆ సినిమాకి ఎంచుకున్న ప్ర‌తి ఎత్తుగ‌డ గొప్ప‌గా స‌క్సెస‌య్యాయి. ప్ర‌మోష‌న్ ప్లానింగ్ పెద్ద రేంజులో వ‌ర్క‌వుటైంది. అయితే అందుకు భిన్నంగా ఈసారి ఇదిగో ఇదే మా టైటిల్ అంటూ `ఆర్.ఆర్.ఆర్`కి ఫుల్ ఫామ్ తో ఓ టైటిల్ ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయ‌డంతో అభిమానులు గంద‌ర‌గోళంలో ప‌డిపోయారు. 
 
ఆ టైటిల్ ఏమైనా గొప్ప‌గా ఉందా? అంటే.. షాక్ తినాల్సిందే. పూర్తిగా అంచ‌నాల‌కి విరుద్ధంగా చాలా సింపుల్‌గా ఈ చిత్ర టైటిల్ లోగోని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేశారు. `రామ రౌద్ర రుషితం` అని టైటిల్ లోగోని రిలీజ్ చేశారు.  అయితే ఈ టైటిల్ ని ద‌ర్శ‌కుడు కాకుండా సినిమా పీఆర్ టీమ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూడ‌గానే మ‌రీ ఇంత చెత్త టైటిలా? అంటూ జ‌నాలు సందేహించారు. ఇది ఒరిజిన‌ల్ గా టీమ్ ప్ర‌క‌టించిన టైటిల్ అయ్యి ఉండ‌దు అన్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. అది కూడా నిజ‌మే. ఇది కేవ‌లం ఫ్యాన్ మేడ్ టైటిల్. టీమ్ అధికారికంగా ప్ర‌క‌టిస్తే మ‌రీ ఇంత సింపుల్ గా ఉంటుందా? అన్న‌ది అంద‌రికీ అర్థ‌మైంది. 
 
 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}