fbpx
Home Cinema RRR బ్యూటీ చాలా కోల్పోయింద‌ట‌!

RRR బ్యూటీ చాలా కోల్పోయింద‌ట‌!

అనుకున్న‌దొక్క‌టి.. అయిన‌ది ఒక్కటి

సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో అవ‌కాశం వ‌స్తే ఎవ‌రైనా కాద‌ని అన‌గ‌ల‌రా? ఏ క‌థానాయిక అయినా కాద‌ని తిర‌స్క‌రించ‌గ‌ల‌రా? ఐశ్వ‌ర్యారాయ్- మాధురి ధీక్షిత్- దీపిక ప‌దుకొనే వంటి స్టార్ల‌ను గొప్ప‌గా ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు. స‌ల్మాన్, ర‌ణ‌బీర్, హృతిక్ వంటి స్టార్ల‌తో గొప్ప గొప్ప ప్ర‌యోగాలు చేసిన ద‌ర్శ‌క‌ధీరుడు భ‌న్సాలీ. దీపిక‌ను ఏకంగా రాజ్ పుత్ క్వీన్ ప‌ద్మావ‌తిగా ఆవిష్క‌రించిన మేరున‌గ‌ధీరుడు. అత‌డి సినిమా అంటే భారీ త‌నం అంత‌కు మించి క‌ళాత్మ‌క‌త‌. అందుకే ఏ మాత్రం ఛాన్స్ వ‌చ్చినా అస్స‌లు వదులుకోలేరు. అయితే స‌రిగ్గా ఇదే పాయింట్ అందాల క‌థానాయిక ఆలియాను ఆక‌ర్షించి అత‌డితో సినిమాకి అంగీక‌రించేలా చేసింది.

అయితే ఆలియా తాను అనుకున్న‌ది ఒక‌టి .. అయిన‌ది ఇంకొక‌టి. స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో ఆఫ‌ర్ అన‌గానే ఎగిరి గంతేసి డేట్స్ ని ఇచ్చేసింది. ఈ సినిమాకి ఇన్షాల్లా అని టైటిల్ ని ఫిక్స్ చేశారు. స‌ల్మాన్ ద‌బాంగ్ 3 చిత్రీక‌ర‌ణ పూర్త‌యిపోతోంది కాబ‌ట్టి సెప్టెంబ‌ర్ లో ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నారు. అయితే చివ‌రి నిమిషంలో ఏమైందో స‌ల్మాన్ తో భ‌న్సాలీ ప్రాజెక్టును కాద‌నుకున్నారు. దీంతో క్యాన్సిల్ అంటూ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ త‌లెత్తాయి. అందుకే కాద‌ని అనుకున్నార‌ట‌. ఒక‌వేళ ఈ ప్రాజెక్టును చేయ‌క‌పోయినా స్నేహితులుగా కొన‌సాగుతామ‌ని వెల్ల‌డించారు. కార‌ణం ఏదైనా ఒక భారీ ప్రాజెక్టులో అవ‌కాశం కోల్పోయ‌న ఆలియాకు మాత్రం ఇది పెద్ద షాక్ అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ స‌ర‌స‌న అవ‌కాశాన్ని కాద‌నుకుంది ఆలియా. ఇప్పుడు అనూహ్యంగా క్యాన్సిల్ అంటూ షాకిచ్చారు. ఆలియా ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ భారీ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తోంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ