fbpx
Home Cinema ప్ర‌భాస్ నా క్యాస్ట్ కాబ‌ట్టి-ఆర్జీవీ

ప్ర‌భాస్ నా క్యాస్ట్ కాబ‌ట్టి-ఆర్జీవీ

డార్లింగ్‌ని ఈ రొంపిలోకి ఎందుకు లాగుతావ్ గురువా!

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `సాహో` ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈనెల 30న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రో నాలుగు రోజులే .. ఇంకా. ఫ్యాన్స్ లో ల‌బ్ డ‌బ్ పెరుగుతోంది. ఒక‌టే గుబులు గుబులుగా టెన్ష‌న్ నెల‌కొంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల్లోనూ, ట్రేడ్ వ‌ర్గాల్లోనూ సాహో గురించిన ఆస‌క్తి నెల‌కొంది. సరిగ్గా ఇదే పాయింట్ ను ఆర్జీవీ క్యాష్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌తిసారీ ఏదైనా స్పెష‌ల్ సంద‌ర్భాన్ని చూసుకుని ఏదో ఒక వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ను చేయ‌డం ద్వారా త‌న సినిమాకి ఫ్రీప‌బ్లిసిటీ కొట్టేసే ఆర్జీవీ ఈసారి తెలుగు రాష్ట్రాల‌ రాజ‌కీయ నాయ‌కుల్లో.. ప్ర‌జ‌ల్లో ఉన్న కుల‌పిచ్చిని ఎన్ క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

`సాహో` రిలీజ్ ముందు జ‌నాల అటెన్ష‌న్ ని త‌న‌వైపు తిప్పేసుకునేందుకు ఆర్జీవీ కొత్త ఎత్తుగ‌డ‌తో బ‌రిలో దిగుతున్నాడు. స‌రిగ్గా మూడు రోజుల ముందు క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు ప్ర‌చారానికి ప్లాన్ చేశారు. తాజాగా రివీల్ చేసిన సోష‌ల్ మీడియా వీడియోలో ఆర్జీవీ మాట్లాడుతూ..“నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అందుక‌నే రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో సినిమా కోసం క‌ళ్లు వాచిపోయేలా ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ప్ర‌భాస్ నా క్యాస్ట్ కాబ‌ట్టి……. ఈ సంద‌ర్భంగా నా నెక్స్ట్‌ సినిమా క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు లోని ఒక పాట‌ను 27వ తారీఖు ఉద‌యం 9.27 నిమిషాలకు బ్ర‌హ్మ ముహూర్తంలో రిలీజ్ చేస్తున్నాం“.. అంటూ ప్ర‌క‌టించారు. అస‌లు ఆర్జీవీ నోట బ్ర‌హ్మ‌ముహూర్తం అనే మాట వెన‌క చాలానే మీనింగ్ ఉంది. అస‌లు ప్ర‌చారానికి ఎలాంటి ముహూర్తం నిర్ణ‌యిస్తే అది పెద్ద స‌క్సెస‌వుతుంది అనే విష‌యంలో మాస్ట‌ర్ డిగ్రీలు పూర్తి చేసిన ఆర్జీవీకి మాత్ర‌మే ఇది సాధ్యం. మొత్తానికి త‌న సినిమాకి ఫ్రీప‌బ్లిసిటీ బాగానే చేసుకుంటున్నా క‌మ్మ‌, రెడ్డి, రాజులు అంటూ కులాల్ని కెలుకుతున్నాడు కాబ‌ట్టి ఏదో ఒక క్ష‌ణం నోరు జారి బుక్క‌యిపోవ‌డం అయితే గ్యారెంటీ.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ