fbpx
Home Cinema ఆర్జీవీ `బ్యూటిఫుల్` మరీ ఇంత ఘాటుగానా!

ఆర్జీవీ `బ్యూటిఫుల్` మరీ ఇంత ఘాటుగానా!

వ‌ర్మ శిష్యుడు కూడా అంతేనా?

వివాదాల ఆర్జీవీ ఓవైపు ఓ సినిమా చేస్తుండ‌గానే మ‌రోవైపు మూడు నాలుగు క్యూలో ఉంటాయి. క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు అంటూ ఓవైపు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో సెన్సేష‌న్స్ కి తెర తీస్తూనే మ‌రోవైపు చిన్న సినిమాలు మూడు నాలుగు తీసేస్తున్నాడు. అందులో కొన్నిటికి శిష్యులు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇదిగో అందులోంచి తాజాగా రివీలైన పోస్ట‌ర్ వేడెక్కిస్తోంది.
 
రామ్ గోపాల్  వర్మ  కొత్త చిత్రం బ్యూటిఫుల్. ట్రిబ్యూట్ టు రంగీలా అనేది ఉప‌శీర్షిక‌. నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా నటిస్తున్నారు. అగస్త్య మంజు దర్శకుడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు రామ్ గోపాల్ వర్మతో పాటు అగస్త్య మంజు సహ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాణమవుతున్న రామ్ గోపాల్ వర్మ చిత్రమిది. టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మిస్తున్నారు. వైవిధ్య భరిత  అంశాలతో ఆకట్టుకోనున్న ఈ చిత్రం ట్రైలర్ ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటలకు విడుదల కానుంది. ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా…సంగీతాన్ని రవి శంకర్ సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.
 
 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ