Home Cinema 30 ఇయ‌ర్స్ పృథ్వీపై మెగా కాంపౌండ్ కుట్ర చేయ‌లేదా?

30 ఇయ‌ర్స్ పృథ్వీపై మెగా కాంపౌండ్ కుట్ర చేయ‌లేదా?

చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా రుణం తీర్చుకోలేను

రాజ‌కీయాల్లో ప‌వ‌న్ పై కామెంట్లు చేసిన 30 ఇయ‌ర్స్ పృథ్వీకి అవ‌కాశాలు రాకుండా తొక్కేశార‌ని ప్ర‌చార‌మైంది. మొన్న ఎన్నిక‌ల్లో జన‌సేనానిపై పృథ్వీ కామెంట్ల‌కు నాగ‌బాబు సీరియ‌స్ అయ్యార‌ని.. దానికి పృథ్వీ వివ‌ర‌ణ ఇచ్చార‌ని ప్ర‌చార‌మైంది. ఆ త‌ర్వాత అత‌డికి ఛాన్సుల్లేకుండా పోవ‌డానికి మెగా కాంపౌండ్ కుట్ర కార‌ణ‌మ‌ని ప్ర‌చార‌మైంది. అయితే అది నిజం కాన‌ట్టేనని ఇది చూశాక అనుకోవ‌చ్చా?

`సైరా`లో మాధవయ్యర్‌ క్యారెక్టర్‌ చేయడం నా పూర్వజన్మ సుకృతం అంటూ 30ఇయ‌ర్స్ పృధ్వీరాజ్ ఈ ఆదివారం సాయంత్రం సైరా ఈవెంట్ లో ఉద్వేగంగా మాట్లాడ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. తన సినీ జీవితంలో ఈ క్యారెక్టర్‌ ఒక్కటి చాలని, ఇంకా సినిమాలు చేయకపోయినా పరవాలేదని ఆయన ఉద్వేగంగా అన్నారు. ఇంటర్వెల్‌ బ్లాక్‌లో అన్నయ్య  గొప్పదనం గురించి చెప్పేటప్పుడు మాధవయ్యార్‌ సునామీలా విరుచుకుపడతాడు. ఇంత మంచి క్యారెక్టర్‌ నాకు ఇచ్చినందుకు అన్నయ్యకు జీవితాంతం రుణపడి ఉంటా. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చుకోలేను… అంటూ పృథ్వీ ఎంతో ఉద్వేగానికి గుర‌య్యారు.  

ఈ రోల్ ఎవరికి రాసుంటే వాడే చేస్తాడురా.. డూ ఇట్‌..డూ యువర్ బెస్ట్ అని అన్న‌య్య‌ అన్నారు. ఆ అవకాశం నన్ను వరించింది. ఆ ఒక్క మాట చాలు నాకు “ఐ ఫీల్‌ దిస్‌ ఇజ్‌ ఆస్కార్‌ అవార్డు ఫర్‌ మీ. దట్‌ ఈజ్‌ ద పవర్‌ ఆఫ్‌ మెగాస్టార్‌“. రికార్డులు బద్దలు కొట్టడానికి  కొణెదల సింహం వస్తున్నాడు… అంటూ పృథ్వీ మాట‌ల్ని కోట‌లు దాటించారు. మొత్తానికి పృథ్వీ ఎమోష‌న్ ని బ‌ట్టి అత‌డిపై ఎలాంటి కుట్ర జ‌ర‌గ‌లేద‌ని భావించ‌వ‌చ్చు. ఇండ‌స్ట్రీలో కోపతాపాలు రాజ‌కీయాల్లో లానే అప్ప‌టిక‌ప్పుడే పుట్టుకొస్తుంటాయి. అప్ప‌టిక‌ప్పుడే మ‌ర్చిపోతుంటారు. కాలంతో పాటే మ‌ర‌పు! అన‌డానికి ఇదే ఉదాహ‌ర‌ణ‌.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ