Home Cinema రెబ‌ల్ క్వీన్ కంగ‌న‌ అడ్డంగా బుక్కైంది

రెబ‌ల్ క్వీన్ కంగ‌న‌ అడ్డంగా బుక్కైంది

బాలీవుడ్ క్వీన్ అత్యుత్సాహమేల‌..

బాలీవుడ్ లో లేడీ రౌడీగా పాపులరైంది కంగ‌న ర‌నౌత్‌. వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారి గ‌త కొంత కాలంగా త‌న సిస్ట‌ర్ రంగోలి చండేల్ తో క‌లిసి ర‌క‌ర‌కాల వివాదాల‌తో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. త‌న‌కు న‌చ్చ‌ని వారిపై డైరెక్టుగా విరుచుకుప‌డే కంగ‌న తాజాగా త‌న తొలి ముద్దు సీక్రెట్ ని బ‌య‌ట‌పెట్టేసి అంద‌రిని ఆశ్చ‌ర్యంలో ముంచేసింది. ఇటీవ‌ల‌ ఢిల్లీలో `ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019` పేరుతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కంగ‌న త‌న ఫ‌స్ట్ క్ర‌ష్ కి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాల్ని, త‌న తొలి ప్రేమ ర‌హ‌స్యాల్ని బ‌య‌ట‌పెట్టేసింది. 17 ఏళ్ల వ‌య‌సులో ఓ పంజాబీ యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డ్డాన‌ని, అప్పుడ‌త‌ని వ‌య‌సు 28 అని, అత‌న్ని తొలిసారి చూడ‌గానే డేట్‌కు వెళ్లాల‌ని అనిపించింద‌ని చెప్పుకొచ్చింది.

అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ..

అయితే ఇక్క‌డే కంగ‌న అడ్డంగా బుక్కైంది. త‌ను 17ఏళ్ల వ‌య‌సులో వుండ‌గా త‌నతో ముంబైలో ఆదిత్య పంచోలి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, శారీర‌కంగా త‌న‌ని హింసించాడ‌ని చెప్పి అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించిన కంగ‌న తాజాగా మ‌రో విధంగా మాట్లాడ‌టం ప‌లువురిలో అనుమానాలు రేకెత్తించింది. గ‌తంలో ఈ విష‌యంపై న‌టుడు ఆదిత్య పంచోలిపై మీడియాకు ఓ బ‌హిరంగ లేఖని కూడా కంగ‌న రిలీజ్ చేసింది. త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని, కంగ‌న అబ‌ద్ధాలు చెబుతోంద‌ని ఆదిత్య పంచోలి ప‌రువు న‌ష్టం దావా కూడా వేశాడు. ఆ కేసు ఇప్ప‌టికీ కోర్టులో కొన‌సాగుతోంది. తాజాగా ఈ విష‌యాన్ని మాయా శ‌ర్మ అనే ఓ నెటిజ‌న్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డ‌మే కాకుండా కంగ‌న మీడియాకు విడుద‌ల చేసిన లెట‌ర్‌ని కూడా పోస్ట్ చేయ‌డంతో కంగ‌న అడ్డంగా బుక్కైపోయిందని బాలీవుడ్ జ‌నాలు చెప్పుకుంటున్నారు.

 

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ