Home Cinema రవితేజ “డిస్కో రాజా” ఫస్ట్ లుక్

రవితేజ “డిస్కో రాజా” ఫస్ట్ లుక్

మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రో ప‌వ‌ర్ ఫుల్ మాస్ అండ్ క్లాస్ సినిమాతో సినీ అభిమానులు ముందుకి రాబోతున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ ని త‌న క‌థాంశాలుగా ఎంచుకుంటూ అటు విమ‌ర్శ‌కులు ఇటు ప్రేక్ష‌కుల‌ ఆద‌ర‌ణ అందుకుంటున్న క్రియేటివ్ డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ డైరెక్ష‌న్ లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఎన‌ర్జీకి స‌రిపోయే విధంగా ఈ సినిమాకు డిస్కో రాజా అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. జ‌న‌వ‌రి 26 రిప‌బ్లిక్ డే తో పాటు ర‌వితేజ పుట్టిన రోజు సంద‌ర్భంగా డిస్కోరాజా టైటిల్ లోగోని విడుద‌ల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత రామ్ తళ్ళూరి మాట్లాడుతూ… ముందుగా మా ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ హీరో మాస్ మహారాజా రవితేజ గారికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. అలానే ప్రేక్ష‌కులు అంద‌రికీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. ర‌వితేజ గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. వినూత్న‌మైన క‌థ‌ల్ని ప్రేక్ష‌కుల ముందుకి తీసుకురావ‌డంలో మా బ్యాన‌ర్ ఎల్ల‌ప్పూడు ముందు ఉంటుంది. ఈ నేప‌థ్యంతోనే దర్శకుడు వి ఐ ఆనంద్ చెప్పిన కథ అద్భుతంగా ఉండడంతో ఓకే చేసి ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. రవితేజ గారు ఇప్పటివరకు ట‌చ్ చేయని జాన‌ర్ లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

ఓ విన్నూత్న‌మైన ఆంశాన్ని ఈ సినిమా క‌థాంశంగా తీసుకున్నాం. మా బ్యానర్ వాల్యు ని మ‌రింత‌ పెంచే విధంగా ఈ చిత్రాన్ని భారీగా నిర్మించబోతున్నాం. హైద‌రాబాద్ తో పాటు గోవా, చెన్నై, ల‌డాఖ్, మ‌నాలీలోతో పాటు నార్త్ ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఈ సినిమాను చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేస్తున్నాము. ప్రీ ప్రొడ‌క్ష‌న్ మొద‌లుపెట్టిన రోజు నుంచే ఈ చిత్రానికి కొన్ని క్రేజీ టైటిల్స్ అనుకుంటూ వ‌చ్చాం. అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా ఈ సినిమా రూపొందించేందుకు మా బృందం మొత్తం ప్లాన్ చేస్తుంది. అందుకే అటు మాస్ ఇటు క్లాస్ ని ఆక‌ట్టుకునే రీతిన ఈ సినిమాకు డిస్కో రాజా అనే టైటిల్ ని ఖారారు చేశాము.

ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ తో పాటు టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకు ప‌నిచేస్తున్నారు. క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ స్వ‌రాలు అందించబోతున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్ గా సాయి శ్రీరామ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అబ్బూరి ర‌వి ఈ సినిమాకు మాట‌లు అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో ర‌వితేజ గారి స‌ర‌స‌న న‌టించ‌నున్నారు. ప్ర‌ముఖ న‌టుడు బాబీసింహా ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడుగా న‌టించ‌బోతున్నారు. క‌మీడియ‌న్స్ వెన్నెల‌కిషోర్, స‌త్య త‌దిత‌ర‌లు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ షెడ్యూల్ ని ప్రారంభించేందుకు స‌న్నాహ‌లు చేస్తున్నాం అని తెలిపారు.

సాంకేతిక వ‌ర్గం

బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్

నిర్మాత : రామ్ త‌ళ్లూరి

ద‌ర్శ‌కుడు : విఐ ఆనంద్

సినిమాటోగ్రాఫ‌ర్ : సాయి శ్రీరామ్

మ్యూజిక్ : థ‌మన్

ఎడిట‌ర్ : న‌వీన్ నూలి

పీఆర్ఓ : ఏలూరు శ్రీను

న‌టీన‌టులు

ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

Recent Posts

సిట్ ఏర్పాటుపై తెలుగు దేశం గుండెల్లో పరిగెత్తుతున్న రైళ్లు 

ప్రతివారం మొక్కు తీర్చుకుంటున్నట్లే ఈ వారం కూడా తన బాధ ప్రపంచం బాధ అన్నట్లు రోతపలుకుల రాధాకృష్ణ  "రాజు కక్షకు రాజ్యం బలి" అనే మకుటం కింద   వలవల ఏడుస్తూ మనలను కూడా...

అసైన్డ్ భూముల సేకరణ వైసిపికి మెడ మీద కత్తే!

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అందుకు అవసరమైన భూముల సేకరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్లు ఇతర రెవిన్యూ సిబ్బంది...

అయిదు ఏళ్ల పాలనపై సిట్! నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

రాష్ట్ర విభజన తర్వాత అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం సాగించిన పరిపాలన పై మొత్తంగా విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహుశా దేశంలోనే ఈలాంటి విచారణ ఇంతకు...

ఎత్తుకు పై ఎత్తుల్లో తెలుగు దేశం చిత్తు

చంద్రబాబు నాయుడు ప్రాపకం ఏ మాత్రం లేకుండా తుడిచి పెట్టే ఎత్తులో మూడు రాజధానుల ప్రతిపాదన ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. అయితే రాజధాని రైతుల ఆందోళన దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు...

నిన్న సుక్కు .. నేడు వంశీ పైడిప‌ల్లి?

మ‌హేష్ క్రేజీ డైరెక్ట‌ర్‌ల‌తో ఆడుకుంటున్నాడా?.. త‌న‌కు న‌చ్చలేద‌ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు డైరెక్ట‌ర్‌ల‌ని మార్చేస్తున్నాడా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాల్ని చూసిన ఇండ‌స్ట్రీ జ‌నాలు నిజ‌మే అంటున్నారు. `మ‌హ‌ర్షి` త‌రువాత మైత్రీలో మ‌హేష్ హీరోగా కొత్త...

త‌రుణ్‌భాస్క‌ర్ ఇలా షాకిచ్చాడేంటి?

టాలీవుడ్‌కు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని హీరోగా అందించిన త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడిగా సినిమా చేసి దాదాపు రెండేళ్ల‌వుతోంది. `మీకు మాత్ర‌మే చెప్తా` అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎలా హ‌డావిడిగా ఈ...

తేజ బర్త్‌డేకు డ‌బుల్ ధ‌మాకా ఇచ్చాడు!

కెరీర్ తొలి నాళ్ల‌లో ద‌ర్శ‌కుడిగా సంచ‌ల‌నం సృష్టించిన తేజ జోరు ఇటీవ‌ల బాగా త‌గ్గిపోయింది. వ‌రుస ఫ్లాపులు.. నిర్మాత‌ల‌తో వివాదాలు.. ఇక సినిమాలు ఆపేయాలేమో అనే స‌మ‌యంలోనే రానాతో `నేనే రాజు నేనే...

`భీష్మ‌` ఓపెనింగ్ అదిరింది!

నితిన్ న‌టించిన తాజా చిత్రం `భీష్మ‌`. టీజ‌ర్ రిలీజ్ నుంచే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ మొద‌లైంది. తొలి రోజు తొలి షో నుంచి హిట్ టాక్ రావ‌డంతో సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అని...

ఫ్లాప్ డైరెక్ట‌ర్‌తో రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌యోగం!

సినిమా ఇండ‌స్ట్రీలో హిట్ మాత్ర‌నమే మాట్లాడుతుంది. ఏదైనా చేస్తుంది. ఎంత వ‌ర‌కైనా తీసుకెళుతుంది. అడ‌గ‌ని అంద‌లం ఎక్కిస్తుంది. అదే ఒక్క ఫ్లాప్ ప‌డిందా అదఃపాతాళానికి తొక్కేస్తుంది. దీన్ఇన బ‌ట్టే ఇక్క‌డ క‌థ‌లు, కాంబినేష‌న్‌లు,...

తెలుగోడా – ఆపక్కనుంటావా? – ఈ పక్కనుంటావా?

"విశ్వసనీయత కోల్పోతున్న మీడియా, దిగజారుతున్న విలువలు," అని ఒక ఆంగ్ల పత్రికలో వ్యాసం. "రాజధాని గుండె పగిలింది" అంటూ ఒక తెలుగు పత్రికలో ప్రత్యేక కథనం. "రాజధాని అక్రమాలపై సిట్" అంటూ మరో...

Featured Posts

సిట్ ఏర్పాటుపై తెలుగు దేశం గుండెల్లో పరిగెత్తుతున్న రైళ్లు 

ప్రతివారం మొక్కు తీర్చుకుంటున్నట్లే ఈ వారం కూడా తన బాధ ప్రపంచం బాధ అన్నట్లు రోతపలుకుల రాధాకృష్ణ  "రాజు కక్షకు రాజ్యం బలి" అనే మకుటం కింద   వలవల ఏడుస్తూ మనలను కూడా...

అయిదు ఏళ్ల పాలనపై సిట్! నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

రాష్ట్ర విభజన తర్వాత అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం సాగించిన పరిపాలన పై మొత్తంగా విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహుశా దేశంలోనే ఈలాంటి విచారణ ఇంతకు...

ఎత్తుకు పై ఎత్తుల్లో తెలుగు దేశం చిత్తు

చంద్రబాబు నాయుడు ప్రాపకం ఏ మాత్రం లేకుండా తుడిచి పెట్టే ఎత్తులో మూడు రాజధానుల ప్రతిపాదన ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. అయితే రాజధాని రైతుల ఆందోళన దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు...