fbpx
Home Cinema టీజ‌ర్: ర‌విబాబు `ఆవిరి` దెయ్యం వ‌ర్క‌వుట్ అవునా?

టీజ‌ర్: ర‌విబాబు `ఆవిరి` దెయ్యం వ‌ర్క‌వుట్ అవునా?

ఆవిరిలోంచి ఆత్మ ఏంటి క‌థ‌?

అల్ల‌రి ర‌విబాబు ఏం చేసినా అందులో సంథింగ్ ఏదైనా కొత్త‌గా ట్రై చేస్తాడ‌నే పేరుంది. ముఖ్యంగా హార‌ర్ సినిమాల‌పై అత‌డికి ఉన్న మక్కువ తెలిసిందే. అత‌డు రూపొందించిన అవును బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. అయితే అవును 2 మాత్రం ఫ్లాపైంది. ఆ త‌ర్వాత పందిపిల్ల జీవిత‌క‌థ‌ను ఎంచుకుని డి.సురేష్ బాబు తో క‌లిసి నిర్మించిన `అదుగో` చిత్రం అంతే డిజాస్ట‌ర్ అయ్యింది.

ఆ రెండు వైఫ‌ల్యాల త‌ర్వాత ర‌విబాబు సైలెంట్ అయిపోయాడు. కానీ దాని అంత‌రార్థం ఇక సినిమాలు వ‌దులుకున్నాడ‌ని కాద‌ని తాజాగా రిలీజైన `ఆవిరి` టీజ‌ర్ సాక్ష్యంగా నిలిచింది. అప్పుడ‌ప్పుడు పోస్ట‌ర్లు రిలీజ్ చేస్తూ నేనూ ఉన్నాన‌ని గుర్తు చేసిన ర‌విబాబు ఈసారి టీజ‌ర్ తో వ‌చ్చాడు. అయితే ఈ టీజ‌ర్ మ‌రో హార‌ర్ కాన్సెప్టుతో ర‌విబాబు ప్ర‌యోగం చేస్తున్నార‌ని చెబుతోంది. టీజ‌ర్ వ‌ర‌కూ గ్రిప్పింగ్ గానే ఉంది. ఇందులో భ‌య‌పెట్టేందుకు ర‌విబాబు ఎంచుకున్న బిగ్ బాస్ టాస్కులు బాగానే క‌నెక్ట‌య్యాయి. ఒక ఇల్లు అందులో తిరుగాడే ఆత్మ‌లు.. వాటి విన్యాసాల నేప‌థ్యంతో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఇంట్లో అల్ల‌రి ఆత్మ‌లు నానా ర‌చ్చ చేస్తుంటాయి. బూట్లు వాటంత‌ట అవే న‌డిచి వెళ్లిపోతాయి. కుర్చీ దానంత‌ట అదే క‌దులుతుంది. బ‌ల్ల‌ల్లోంచి స్క్రూలు వాటంత‌ట అవే ఊడి వ‌చ్చేస్తుంటాయి. దెయ్యం జూస్ ఒంపుకుని తాగేస్తుంది. అయితే ఇవ‌న్నీ ఇంత‌కుముందు ఎన్నో హార‌ర్ సినిమాల్లో చూసేసిన‌వే. అంతెందుకు ర‌విబాబు తీసిన అవునులోనే ఈ త‌ర‌హా కంటెంట్ అల‌రించింది. అయితే అంత‌కుమించి ర‌విబాబు ఆవిరిలో ఏం చూపిస్తున్నాడు? అన్న‌దే అస‌లు టాస్క్. అల్ల‌రి ర‌విబాబు ఈ టాస్క్ ని ఎలా హ్యాండిల్ చేశాడ‌న్న‌ది అక్టోబ‌ర్ 18న సినిమా రిలీజ్ వ‌ర‌కూ వేచి చూడాలి. ఈ చిత్రానికి క‌థ‌, క‌థ‌నం ర‌విబాబు అందించారు. దిల్ రాజుతో క‌లిసి నిర్మించారు.

 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ