fbpx
Home Cinema హీరోయిన్‌కే చెక్ పెట్టేసిన స్పోర్ట్స్‌ స్టార్ పీవీ సింధు!

హీరోయిన్‌కే చెక్ పెట్టేసిన స్పోర్ట్స్‌ స్టార్ పీవీ సింధు!

గ్లామ‌ర‌స్ హీరోయిన్ అనుకుంటోందా?

మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీల‌కు గ్లామ‌ర‌స్ ఫోజులివ్వాలంటే సినీతార‌లే దిగి రావాలా? స‌్పోర్ట్స్ స్టార్లు ఇలాంటి ప్ర‌య‌త్నం చేస్తే త‌ప్పా? ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా నేటిత‌రం క్రీడాకారిణులు నిలుస్తున్నారు. ఇప్ప‌టికే సానియా, సైనా నెహ్వాల్ లాంటి క్రీడాకారిణులు మ్యాగ‌జైన్ల క‌వ‌ర్ పేజీల‌పై ఎంతో అందంగా .. సంథింగ్ హాట్ గానూ ఫోజులిచ్చిన సంద‌ర్భాలున్నాయి. కేవ‌లం బ్యాడ్మింట‌న్.. టెన్సిస్ స్టార్లు మాత్ర‌మే కాదు.. చెస్.. షూటింగ్ వంటి క్రీడ‌ల్లో రాణిస్తున్న ప‌లువురు తెలుగు తేజాలు మ్యాగ‌జైన్ క‌వ‌ర్ షూట్లు.. ఫోటోషూట్లు .. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల కోసం షూట్లు అంటూ చాలా బిజీగా ఆర్జిస్తున్నారు.
 
ఇక ఇదే కేట‌గిరీలో ఒలింపిక్ ప‌థ‌క విజేత పీవీ సింధు ఇత‌రుల కంటే ఫుల్ బిజీ. తాజాగా ప్ర‌ఖ్యాత ప్ర‌ఖ్యాత ఫెమీనా మ్యాగజైన్ 60 వ‌సంతాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా క‌వ‌ర్ పేజీపై పీవీ సింధు ఫోటోషూట్ ని హైలైట్ గా వేశారు. బాలీవుడ్ క‌థానాయిక దీపిక ప‌దుకొనే , కిర‌ణ్ మ‌జుందార్ వంటి టాప్ రేంజు సెల‌బ్రిటీల‌తో క‌లిసి పీవీ సింధు క‌వ‌ర్ పేజీపై ఎంతో ఎలివేషన్ తో క‌నిపించారు. 60 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా వివిధ రంగాల్లో రాణించిన టాప్ సెల‌బ్రిటీల్ని ఎంచుకుని ఈ క‌వ‌ర్ పేజీని రూపొందించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ ఫోటోల్లో దీపిక ప‌దుకొనేతో పోటీప‌డుతూ పీవీ సింధు చాలా స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. ఇక స్పోర్ట్స్ స్టార్ గా వ‌చ్చిన ఇమేజ్ తో తెలుగ‌మ్మాయి పీవీ సింధు ఒక్కో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌కు కోట్ల‌లో ఆర్జిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ కంపెనీల‌తో ఒప్పందాలు కుదుర్చుకుని ఇప్ప‌టికే పీవీ సింధు భారీగా ఆర్జించార‌ని ప‌లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. పీవీ సింధు జీవిత‌క‌థ‌తో సోనూసూద్ ఓ బ‌యోపిక్ ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ బ‌యోపిక్ కి సంబంధించిన తాజా వివ‌రాలు తెలియాల్సి ఉంది. 
 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}