fbpx
Home Cinema నాగ్ పాత్రలో ప్రభాస్...మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

నాగ్ పాత్రలో ప్రభాస్…మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

మీకు గుర్తుందా అక్కినేని కుటుంబ కధా చిత్రం “మనం” సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నాగార్జున పాత్ర?. జమీందార్ గా కనిపించే నాగార్జునకు వింటేజ్ కార్లంటే చాలా ఇష్టం. నచ్చిన కారు కోసం ఎంత డబ్బు ఖర్చుపెట్టడానికి అయినా వెనకాడడు.

సరిగ్గా ఇలాంటి పాత్రనే ఇప్పుడు ప్రభాస్ కూడా పోషిస్తున్నాడని తెలుస్తోంది. అలా ఓ వింటేజ్ కార్ కోసం వెళ్లిన ప్రభాస్…ప్రేమలో పడటం తో కథ ముందుకు వెళ్తుందని తెలుస్తోంది. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో వింటేజ్ కార్లు కొనే ధనవంతుడిగా కనిపించబోతున్నాడు ప్రభాస్. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ వివరాల్ని స్వయంగా వెల్లడించాడు.

గోపిచంద్ తో జిల్ చిత్రం తీసిన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ పీరియ‌డ్ ల‌వ్‌ స్టోరీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబందించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్నీ దర్శకుడు రాధాకృష్ణ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ సినిమా ఓ ప్రేమకథ అని… 1960 నాటి కాలంలో ఈ కథ సాగుతుందని, సినిమాలో వింటేజ్ కార్లకు, ప్రభాస్ కు చాలా దగ్గర సంబంధాలుంటాయని రాధాకృష్ణ తెలిపారు. మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్, సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ