Home Cinema ప్ర‌భాస్- అనుష్క జోడీ అమెరికా షిఫ్ట‌వుతున్నారా?

ప్ర‌భాస్- అనుష్క జోడీ అమెరికా షిఫ్ట‌వుతున్నారా?

ప్ర‌భాస్ – అనుష్క లాస్ ఏంజెల్స్‌లో సొంతిల్లు?

ప్ర‌భాస్ – అనుష్క వెండితెర‌పై హిట్‌ పెయిర్ గా పాపుల‌ర్. బిల్లా, మిర్చి, బాహుబలి 1, 2 చిత్రాల్లో నటించారు. ఆ క్ర‌మంలోనే ఆ జంట మ‌ధ్య ఎఫైర్ సాగుతోందంటూ ప్ర‌చార‌మైంది. స్వీటీని ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని ఇప్ప‌టికీ అభిమానుల్లో ప్ర‌చారం ఉంది. మ‌రోవైపు ఈ జంట గురించి తెలుగు మీడియా కంటే ఉత్త‌రాది మీడియాలో ఎక్కువ ఆస‌క్తి నెల‌కొంది. అక్క‌డ తామ‌ర‌తంప‌ర‌గా ఈ జంట ప్రేమాయ‌ణంపై వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.

తాజాగా ప్ర‌ఖ్యాత ముంబై మిర్ర‌ర్ ప్ర‌చురించిన క‌థ‌నం సంచ‌ల‌న‌మైంది. ప్ర‌భాస్- అనుష్క జంట ప్ర‌స్తుతం లాస్ ఏంజెల్స్ (అమెరికా)లో సొంతంగా ఇల్లు కొనుక్కునే ప్లాన్ చేస్తున్నార‌ని ఈ క‌థ‌నం పేర్కొంది. ప్ర‌స్తుతం ఈ జంట సొంత అపార్ట్‌మెంట్ కోసం సెర్చింగ్‌లో ఉన్నార‌ని ప్ర‌చురిత‌మైంది. అయితే ఇది కేవ‌లం రూమ‌ర్ మాత్ర‌మేనా? లేక అందులో నిజం ఉందా? అన్న‌ది పైవాడికే తెలియాలి. మేమిద్దరం కేవ‌లం స్నేహితులు మాత్ర‌మేన‌ని ప్ర‌భాస్- అనుష్క చెబుతుంటారు. మ‌రి ముంబై మీడియాలో ఇలా ప్ర‌చారం సాగుతోంది.

మ‌రోవైపు ప్ర‌భాస్ కి అమెరికా సంబంధం కుదిర్చేందుకు పెద‌నాన్న రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు స‌న్నాహాల్లో ఉన్నార‌న్న ప్ర‌చారం ఉంది. మ‌రి ఈ రెండు వార్త‌ల్లో ఏది న‌మ్మాలి? అన్న‌ది జ‌నాల‌ విజ్ఞ‌త‌కే వ‌దిలేయాలి. ప్ర‌భాస్ న‌టించిన భారీ యాక్ష‌న్ చిత్రం సాహో ఆగ‌స్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. ఈ సినిమా ప్ర‌చారంలో ప్ర‌భాస్ బిజీ. హిందీలోనూ సాహోని భారీగా రిలీజ్ చేస్తున్నారు కాబ‌ట్టి డార్లింగ్ పై ఉత్త‌రాది మీడియా మ‌రీ టూమ‌చ్ గా ప్ర‌చారం చేసేస్తోంది. ముఖ్యంగా గాసిప్పులు వండి వార్చ‌డంలో వాళ్లు మ‌హా దిట్ట‌.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ