fbpx
Home Cinema ఫ్యాన్స్ కి చెయ్యిచ్చాక డెట్టాల్ తో క‌డుక్కుంటాడు!

ఫ్యాన్స్ కి చెయ్యిచ్చాక డెట్టాల్ తో క‌డుక్కుంటాడు!

అభిమానుల‌పై ప‌వ‌ర్‌ స్టార్ క‌పట‌ ప్రేమ‌?

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు.కోలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ గా అత‌డు సుప‌రిచితం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల‌తో భారీగా అభిమాన సంఘాలున్న‌ పెద్ద స్టార్ అత‌డు. చిటికేస్తే ప్రాణాలిచ్చే అభిమానులెంద‌రో. విజ‌య్ సినిమా రిలీజ‌వుతోంది అంటే  థియేట‌ర్ల వ‌ద్ద ఏ రేంజ్ లో హంగామా ఉంటుందో తెలిసిందే.

అంతేనా.. త‌న అభిమానుల పెళ్లిళ్ల‌కు స్వ‌యంగా హాజ‌రైన ఏకైక హీరోగా విజ‌య్ పేరు మార్మోగింది. అలాంటి స్టార్  పై  సామి అనే ఓ త‌మిళ‌ డైరెక్ట‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసాడు. విజ‌య్ అభిమానుల ప‌ట్ల దొంగ ప్రేమ చూపిస్తాడ‌ని.. అత‌డి ప్రేమ నాలుక‌పై త‌ప్ప‌… హృద‌యంలోంచి ఉండ‌ద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశాడు.

అభిమానుల‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన త‌ర్వాత డెటాల్ తో  చెయ్యి క‌డుక్కుంటాడు. అది నిజ‌మైన ప్రేమ కాదు. ప్రేమ‌కు అస‌లు కొల‌మానాలే ఉండ‌కూడ‌దు. కానీ విజ‌య్ చూపించే అభిమానంలో కొన్ని లెక్క‌లుంటాయి. అవి బాక్సాఫీస్ ను దృష్టిలో పెట్టుకుని వేసుకున్న‌వే ఎక్కువ‌గా ఉంటాయి… అని విమ‌ర్శించాడు. విజ‌య్ పై అభిమానం తగ్గించాల‌ని అత‌డి ఫ్యాన్స్ కు సూచించాడు. అలాగే విజ‌య్ సినిమాలు చేయ‌డం త‌గ్గించాల‌ని డిమాండ్ చేసాడు. మ‌రి సామి అనే డైరెక్ట‌ర్ ఎవ‌రు?  విజ‌య్ పై ఇంత వైలెంట్ గా రియాక్ట్ అవ్వ‌డానికి కార‌ణం ఏంటి?  ఇద్ద‌రి మ‌ధ్య‌ ఏవైనా విబేధాలు ఉన్నాయా?  లేక ఇదోర‌కం ప‌బ్లిసిటీ స్టంట్ యేనా? అన్న‌ది అన్న‌ది తెలియాల్సి ఉంది. విజ‌య్ ప్ర‌స్తుతం అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో బిగిల్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సామి వివ‌రాల్లోకి వెళితే.. అత‌డు ఉయిర్.. మిరుగ‌మ్.. సింధు సామవేళి అనే చిత్రాల్ని తెర‌కెక్కించాడు. అమ‌లాపాల్ క‌థానాయిక‌గా మృగం ( సింధు సామవేళి) చిత్రం తీసింది ఈయ‌నే. 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ