fbpx
Home Cinema ఫొటోల సాక్ష్యం : పవన్ మీద ఆ వార్త నిజమే

ఫొటోల సాక్ష్యం : పవన్ మీద ఆ వార్త నిజమే

 సైరా నరసింహారెడ్డి  లో పవన్ వాయిస్ నిజమే!

రెండు రోజుల క్రితం సైరా నరసింహా రెడ్డి మూవీ మేకింగ్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.అదిరిపోయే విజువల్స్, థ్రిల్లింగ్ తో సాగే యుద్ధ సన్నివేశాలలతో సైరా మూవీ ఫ్యాన్స్ కు ఓ మంచి ఎక్సపీరియన్స్ ఇవ్వనుందని ఆ వీడియో చూస్తే అర్థం అయ్యింది. అలాగే ఆ మేకింగ్ వీడియోలో ఈనెల 20న సైరా టీజర్ ని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.కాగా టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఉంటుందని కొద్దిరోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్త.

సైరా లో చిరంజీవి క్యారక్టర్ అద్భుతంగా ఎలివేట్ అయ్యేలా పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెవుతారని చెప్పడం జరిగింది. ఐతే దీనిపై ఎటువంటి అఫీషియల్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఇది ఎంత వరకు వాస్తవం అనే డౌట్ ఉంది. అయితే ఈ అనుమానాలకు తెరదించుతూ పవన్ సైరా కి వాయిస్ ఓవర్ చెప్పారు.

డబ్బింగ్ థియేటర్లో పవన్ డబ్బింగ్ చెవుతున్న ఫోటోలు బయటకి రావడం జరిగింది. దీనితో ఈ విషయం స్పష్టం అయినది. మెగా స్టార్ మూవీ టీజర్ కి పవర్ స్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది, మెగా ఫ్యాన్స్ కు పండగ చేసుకునే వార్త. పైగా పవన్ సినిమాలు మానేసిన ఈ టైమ్ లో కనీసం తెరపై ఆయన వాయిస్ విని పవన్ ప్యాన్స్ ఆనందించనున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}