fbpx
Home Cinema తెలుగు సినిమా చరిత్రకు పవన్ చేయూత

తెలుగు సినిమా చరిత్రకు పవన్ చేయూత

తెలుగు సినిమా చరిత్రకు పవన్ చేయూత

ఒకప్పుడు తెర మీద దేదీప్య మానంగా వెలిగిన తారలను ఈ నాటి ప్రేక్షకులు మర్చిపోతున్నారని , ఇది నిజంగా దౌర్భాగ్యమని , వారి జీవితాలపై బయోపిక్ లు తీస్తే తప్ప తెలియని స్థితి రావడం బాధాకమని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు . హైద్రాబాద్లో తెలకపల్లి రవి రచించిన ” మన సినిమాలు . అనుభవాలు .. చరిత్ర .. పరిణామం ” అన్న పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు . ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నాకు కవులన్నా , రచయితలన్నా ఎంతో ఇష్టం . వారు సమాజానికి మార్గదర్శకులుగా వుంటారని చెప్పారు . భావితరాలకు ఉపయోగపడే చరిత్ర రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని , సామర్ధులైన రచయితల నుంచి నిజమైన చరిత్ర రాకపోతే అవగాహన లేని రచయితలు రాసిందే చరిత్రగా చలామణి అవుతుందని పవన్ తెలిపారు .

తెలుగు సినిమా రంగంలోనూ , సాహిత్య రంగంలోనూ గొప్ప రచయితలు ఎందరో వున్నారు . బాహుబలి లాంటి సినిమాలు వచ్చినా , ఇంకా ఉత్తమోత్తమ కథా సాహిత్యం మన దగ్గర వుంది . ఆ రకంగా ఆలోచించి అడుగు వేయగలితే గొప్ప సినిమాలు మనం కూడా తీయగమని పవన్ చెప్పారు . సినిమాలు జీవితాన్ని ఎలా ప్రతిబింబిస్తాయో అలాగే జీవితం కూడా సినిమాను ప్రభావితం చేస్తుందని పవన్ తెలిపారు . తెలుగు సినిమా చరిత్ర ను నేను ప్రోత్సహిస్తా నాని పవన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు .

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ