fbpx
Home Cinema కుర్ర‌హీరోతో ప‌వ‌న్ హీరోయిన్ డేటింగ్

కుర్ర‌హీరోతో ప‌వ‌న్ హీరోయిన్ డేటింగ్

పుల‌కిత్ ప్రేమ‌లో పుల‌కిస్తోంది

ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన `తీన్‌మార్‌` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఢిల్లీ చిన్న‌ది కృతిక‌ర్భందా. తెలుగులో తొలి చిత్రంతోనే ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న కృతికి ఆ స్థాయిలో మాత్రం అవ‌కాశాలు వ‌రించ‌లేదు. చివ‌రి ప్ర‌య‌త్నంగా చేసిన `ఒంగోలు గిత్త‌`, రామ్‌చ‌ర‌ణ్‌కు సోద‌రిగా న‌టించిన `బ్రూస్‌లీ` చిత్రాలు కూడా నిరాశ‌ప‌రచ‌డంతో టాలీవుడ్‌కు టాటా చెప్పేసి బాలీవుడ్‌లో పాగా వేసింది. బాలీవుడ్‌తో పాటు త‌మిళంలో వ‌రుస ఆఫర్ల‌తో బిజీగా వున్న కృతి క‌ర్బందా బాలీవుడ్ యంగ్ హీరో పుల్‌కిత్ స‌మ్రాట్‌తో గ‌త కొంత కాలంగా డేటింగ్ చేస్తోంద‌ని తెలుస్తోంది.

ఈ జంట‌ క‌లిసి తొలిసారి `వీరే కి వెడ్డింగ్` అనే చిత్రంలో న‌టించారు. ఆ సినిమా విజ‌యం సాధించ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుంధం ఏర్ప‌డింద‌ట‌. తాజాగా ఇద్ద‌రూ క‌లిసి `పాగల్ పాంటీ`లోనూ న‌టిస్తున్నారు. కృతికి ద‌క్షిణాది వంట‌కాలంటే చాలా ఇష్టం. ఆమె ఇష్టాన్ని గమ‌నించిన పుల‌కిత్ త‌ను కూడా ద‌క్షిణాది వంట‌కాల‌పై మోజు పెంచుకుంటున్నాడ‌ని, ఆ వంట‌కాల‌ని అల‌వాటు చేసుకుంటున్నాడ‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న `పాగల్ పంటీ` షూటింగ్ ప్ర‌స్తుతం ముంబాయిలో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణం జోరుగా సాగుతోందని చిత్ర బృందం గుస‌గుస‌లాడుతోంది.

పుల‌కిత్ స‌మ్రాట్ కి ఇదివ‌ర‌కే పెళ్లైంది. 2015లో శ్వేతా రోహిరాతో పుల‌కిత్ స‌మ్రాట్ వివాహం జ‌రిగింది. అయితే ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థలు రావ‌డంతో ఏడాది తిర‌క్కుండానే ఇద్ద‌రు విడాకులు తీసుకుని విడిపోయారు. అప్ప‌టి నుంచి సింగిల్‌గానే వుంటున్న పుల‌కిత్ గ‌త కొంత కాలంగా కృతికి ఎట్రాక్ట్ అయ్యాడ‌ని, ఆమెతో పీక‌ల్లోతు ప్రేమలో మునిగిపోయాడ‌ని, కృతి కూడా పుల‌కిత్ ప్రేమ‌లో పుల‌కించిపోతోంద‌ని బాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ