fbpx
Home Cinema జ‌య‌ల‌లిత బ‌యోపిక్ .. నిత్యా గెట‌ప్ లీక్

జ‌య‌ల‌లిత బ‌యోపిక్ .. నిత్యా గెట‌ప్ లీక్

అమ్మ జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్. ఒకేసారి త‌మిళంలో రెండు బ‌యోపిక్ లు తెర‌కెక్కుతున్నాయి. వీటిని తెలుగు, త‌మిళం, హిందీలో రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. కంగ‌న టైటిల్ పాత్ర‌లో బ‌యోపిక్ గురించి ఓ వైపు వార్త‌లు వెలువ‌డుతుండ‌గానే మ‌రోవైపు నిత్యామీన‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న బ‌యోపిక్ గురించి ఆస‌క్తిక‌ర స‌మాచారం రివీలైంది. 
 
ఈ చిత్రానికి ది ఐర‌న్ లేడి అనే టైటిల్ ని ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్రియ‌ద‌ర్శిని అనే మ‌హిళా ద‌ర్శ‌కురాలు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రీప్రొడ‌క్ష‌న్ సాగుతోంది. నిత్యామీన‌న్ కి లుక్ టెస్టులు పూర్తి చేశారు. తాజాగా వీటి నుంచి ఓ ఫోటో ఒక‌టి రివీలైంది. ఇది నిత్యా స్కెచ్ అని అర్థ‌మ‌వుతోంది. అమ్మ పాత్ర‌లో నిత్యా ఎలా ఉంటుందో ఆవిష్క‌రించిన ఫోటో ఇది. చూడ‌గానే అవును అచ్చం అమ్మ‌లానే ఉందే! అంటూ అంతా పొగిడేస్తున్నారు. పాన్ ఇండియా బేసిస్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం కోసం భారీగానే బ‌డ్జెట్లు పెడుతున్నార‌ని తెలుస్తోంది. అయితే ఒకేసారి రెండు బ‌యోపిక్ లు తెర‌కెక్కుతుండ‌డంతో ఆ రెండిటికి మ‌ధ్య వైవిధ్యాన్ని ఎలా పాటించ‌నున్నారు? అన్న‌ది చూడాలి. ఇక అమ్మ పాత్ర కోసం నిత్యామీన‌న్ బ‌రువు పెరుగుతున్నార‌న్న స‌మాచారం ఉంది. టీనేజ‌ర్ గా ఉన్న‌ప్పుడే క‌థానాయిక అయిన జ‌య‌ల‌లిత అటుపై పెద్ద స్టార్ గా ఎదిగారు. అప్ప‌టి రూపానికి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి రూపానికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా నిత్యాలోని బొద్దుత‌నం అమ్మ పాత్ర వేషధార‌ణ‌కు సూటైంద‌ని అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.
 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ