Home Cinema బొంగ‌రం ఆడిస్తున్న ఆసియా సెక్సీ స్టార్

బొంగ‌రం ఆడిస్తున్న ఆసియా సెక్సీ స్టార్

న‌డుముని గింగిరాలు తిప్పేసింది

బుల్లితెర‌పై మెరుపులు మెరిపించి.. త‌న అందంతో ఔరా అనిపించింది నియా శ‌ర్మ‌. టెలివిజ‌న్ రంగంలో య‌మ బిజీగా మారిన ఈ సెక్సీ న‌టి `ట్విస్టెడ్` అనే వెబ్ సిరీస్‌తో పాపుల‌ర్ అయింది. త‌న‌కిచ్చిన పాత్ర‌లో మ‌రీ హాట్‌గా న‌టించి ఆక‌ట్టుకునే నియా శ‌ర్మని ఆ మ‌ధ్య పోర్న్ స్టార్ అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్స్ ట్రోల్ చేసినా ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌టేదు. క‌ల‌ర్స్ టీవీలో ప్ర‌సారం అవుతున్న `ఫియ‌ర్ ఫాక్ట‌ర్‌: ఖ‌త్రోంకె ఖిలాడి-9` లో న‌టిస్తున్న నియా శ‌ర్మ త‌న ఎక్స్‌ట్రా టాలెంట్‌తో ఔరా అనిపించింది. సెక్సీ న‌టిగా ఇప్ప‌టికే ఓ స్టాప్‌ని వేసుకున్న నియా సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న ఫిట్ నెస్ వీడియోల‌తో ఆక‌ట్టుకుంటోంది.
 
సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకున్న నియా త‌న ఫిట్ నెస్ వీడియోల‌తో ఫ్యాన్స్‌ని మెస్మ‌రైజ్ చేస్తోంది. తాజాగా అలాంటి ట్రిక్‌నే ప్లే చేసి త‌న అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచేసింది. ఇటీవ‌ల నియా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు వైర‌ల్‌గా మారాయి. ఫిట్ నెస్‌కి ప్రాధాన్య‌త‌నిచ్చే నియా ఫిట్ నెస్‌లో భాగంగా హులా హూపింగ్ విన్యాసం ఆక‌ట్టుకుంటోంది. న‌డ‌ముని గింగిరాలు తిప్పేస్తూ ఓ రింగ్‌ని న‌డుముపై నాట్యం చేయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నాజూకు న‌డుముపై నియా రింగ్‌ని నాట్యం చేయించ‌డంపై నెటిజ‌న్‌లు కామెంట్లు పెడుతున్నారు.  
 

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ