fbpx
Home Cinema మిత్ర‌ద్రోహానికి పాల్ప‌డిన మిల్కీ బ్యూటీ

మిత్ర‌ద్రోహానికి పాల్ప‌డిన మిల్కీ బ్యూటీ

స్నేహితురాలికి అలా ద్రోహం చేయొచ్చా?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా త‌న స్నేహితురాలికి మిత్ర‌ద్రోహం చేసిందా? ఫ్రెండుకు ద‌క్కాల్సిన ఆఫ‌ర్ ని త‌న ఖాతాలో వేసుకుందా? అంటే .. ఈ ఎపిసోడ్ లో `ద్రోహం` ఉందో లేదో తెలీదు కానీ.. త‌న జిగిరీ ఫ్రెండు శ్రుతిహాస‌న్ కి ద‌క్కాల్సిన ఆఫ‌ర్ ని త‌మ‌న్నా కాజేసింద‌న్న‌ది నిజం.

`స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలో శ్రుతిహాస‌న్ కి ఓ స్పెష‌ల్ నంబ‌ర్ లో ఆఫ‌ర్ ఇచ్చార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. అయితే ఉన్న‌ట్టుండి ఆ ప్లేస్ ని త‌మ‌న్నాతో రీప్లేస్ చేశారు. మిల్కీ ఈ చిత్రంలో ఐటెమ్ నంబ‌ర్ కాదు కానీ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ చేస్తోంద‌ని తెలుస్తోంది.

ఫ్రెండుకి ఎర్త్ పెట్టిన మిల్కీ

అయితే ఎందుకిలా స్నేహితురాలికే ద్రోహ‌మా? అంటే.. అలాంటిదేం లేదు. ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఆ ఇద్ద‌రిలో ఒక‌రిని ఎంపిక చేసుకోవాల‌ని అనుకున్నారు. అందులో త‌మ‌న్నా వైపే అంద‌రూ మొగ్గు చూపార‌ట‌. దాంతో త‌ప్ప‌నిస‌రిగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నానే ఎంపిక చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలుస్తోంది.
ఇద్ద‌రూ గ్రేట్ ఫ్రెండ్స్ క‌దా.. హిగ్గులిచ్చుకుని ముద్దులాడేసుకుంటారు క‌నిపిస్తే.. అయినా ఇలా చేసిందేమిటి? అంటూ మాట్లాడుకోవ‌డానికేమీ లేదు. ప్చ్.. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ఛాయిస్ అలా ఉంది మ‌రి..

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ