fbpx
Home Cinema సూప‌ర్ స్టార్ బ్యాక్ టు స‌రిలేరు

సూప‌ర్ స్టార్ బ్యాక్ టు స‌రిలేరు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు షూటింగ్ మ‌ధ్య‌లో బ్రేక్ తీసుకుని విహార యాత్ర‌ల‌కు వెళ్ల‌డం అల‌వాటు. వారం రోజుల పాటు ఫ్యామిలీతో విదేశాలు వెళ్లి చిల్ అవుతారు. అక్క‌డ‌ అంద‌మైన ప్ర‌దేశాల‌ను, వంట‌ల‌ను రుచి చూసి త‌న అనుభూతుల్ని ట్విట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంటారు. ఇటీవ‌ల ద‌స‌రా సెల‌వులు నేప‌థ్యంలో న‌మ్ర‌త‌, పిల్ల‌లు గౌత‌మ్, సితార తో క‌లిసి స్విట్జ‌ర్లాండ్ కు ట్రిప్ వెళ్లిన‌ సంగ‌తి తెలిసిందే. ద‌సరా పండుగ‌..సెల‌వులు పూర్త‌వ్వ‌డంతో మ‌హేష్ మ‌ళ్లీ ఫ్యామిలీతో హైద‌రాబాద్ లో దిగిపోయారు. నేను షూటింగ్ కి… గౌత‌మ్, సితార‌లు స్కూల్ కి అంటూ సెల‌వులు ముగిసిన విష‌యాన్ని ట్విట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు.

ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో స‌రిలేరు నీకెవ్వ‌రు లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా భాగం చాలా భాగం చిత్రీక‌రణ పూర్తిచేసారు. ఇందులో మ‌హేష్ బాబు స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న న‌టిస్తోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్ర‌చార చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. అలాగే ద‌స‌రా కానుక‌గా జ‌న‌వ‌రి 12న సినిమా విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి సినిమాల త‌ర్వాత‌ న‌టిస్తోన్న చిత్రమిది. దీంతో స‌రిలేరుపై భారీ అంచ‌నాలున్నాయి. క‌థ‌లో అనీల్ గ‌త సినిమాల్లో మాదిరి కామెడీ ఉన్నా! మ‌హేష్ ది ఆర్మీ అధికారి పాత్ర కాబ‌ట్టి యాక్ష‌న్ కూడా పీక్స్ లో నే ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ