fbpx
Home Cinema మటాష్ అయినా, మళ్లీ తెలుగులో మాధవన్ ?

మటాష్ అయినా, మళ్లీ తెలుగులో మాధవన్ ?

మణిరత్నం హీరో మాధవన్ తన కెరీర్ లో ఎన్నో క్యారక్టర్స్ చేసారు. తాజాగా తెలుగులో విలన్ గా కూడా చేసారు. నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’లో విలన్‌గా కనిపించారు. సినిమా ఫ్లాఫ్ అయినా మాధవన్ మెప్పించారని టాక్ వచ్చింది. దాంతో ఆయన తెలుగు నుంచి వరసగా విలన్ ఆఫర్స్ వస్తున్నాయని టాక్.

తాజాగా మాధవన్… రవితేజ సినిమాలో విలన్ తరహా ఓ విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారని వినిపిస్తోంది. రవితేజ-దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధవన్ గెటప్ చాలా విభిన్నంగా ఉంటుందని ఆ పాత్ర సినిమాకు హైలెట్ గా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.

ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మరి మాధవన్ విలన్‌గా నటిస్తున్నారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక త్వరలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ