fbpx
Home Cinema కొమురం భీమ్ జయంతి రోజున ఫస్ట్ లుక్

కొమురం భీమ్ జయంతి రోజున ఫస్ట్ లుక్

ఆర్‌ఆర్‌ఆర్ (వర్కింగ్ టైటిల్). ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. అలియాభట్ ఓ కథానాయికగా నటిస్తుండగా కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్‌దేవ్‌గణ్ కనిపించనున్నారు. ఎన్టీఆర్ ఆదివాసీ పోరాట యోధుడు కొమురంభీమ్ పాత్రలో నటిస్తుండగా, రామ్‌చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ చిత్రం మోటర్ సైకిల్ డైరీస్ స్ఫూర్తితో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. కాగా ఈ చిత్రంలోని ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కొమురం భీమ్ జయంతి సందర్భంగా అక్టోబర్ 22న విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చిత్ర వర్గాలు త్వరలో అధికారికంగా ఓ ప్రకటన చేసే అవకాశం వుందని తెలిసింది. కాగా చిత్రాన్ని 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలతో పాటు మొత్తం పది భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ