fbpx
Home Cinema సుజీత్ విన్నావా? కింగ్ ఖాన్‌కి యాక్ష‌న్ స్క్రిప్టు ప్లీజ్!

సుజీత్ విన్నావా? కింగ్ ఖాన్‌కి యాక్ష‌న్ స్క్రిప్టు ప్లీజ్!

సాహోతో హిట్టు కొడితే కింగ్ ఖాన్‌తో ఛాన్స్!

ప్ర‌తిభ చాలామందికి ఉంటుంది. కానీ అవ‌కాశాలు ద‌క్కించుకునేది కొంద‌రే. ఒకే ఒక్క ఛాన్స్ లైఫ్ ని ఎటో ట‌ర్న్ తిప్పేస్తుంది. అలాంటి ఒకే ఒక్క ఛాన్స్ సుజీత్ కి ద‌క్కింద‌నే చెప్పాలి. ఈ యంగ్ డైరెక్ట‌ర్ పేరు ప్ర‌స్తుతం టాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో మార్మోగుతోంది. ఒకే ఒక్క సినిమాతో `సాహో` లాంటి భారీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న యువ‌ద‌ర్శ‌కుడు అంటూ ప్ర‌తిచోటా ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. శ‌ర్వానంద్ హీరోగా యువి సంస్థ నిర్మించిన `ర‌న్ రాజా ర‌న్` చిత్రంతో విజ‌యం అందుకున్న ఎన‌ర్జిటిక్ డైరెక్ట‌ర్ సుజీత్ సాహో ఆఫ‌ర్ కోసం ఎంతో ఓపిగ్గా వేచి చూశాడు. ప్ర‌భాస్ బాహుబ‌లి చిత్రంలో న‌టించేప్పుడే స్క్రిప్టు వినిపించే ఓకే చేయించుకున్నాడు. ఆ త‌ర్వాత ఏడాది పైగానే వేచి చూసి ఎట్ట‌కేల‌కు సినిమాని ఇప్ప‌టికి పూర్తి చేశాడు. సాహో 2019 మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో నిలిచింది.

ఈ సినిమా ఖాన్ ల‌కే మ‌తిచెడే ట్రీట్ ఇవ్వ‌బోతోంద‌న్న టాక్ అటు బాలీవుడ్ మీడియాలోనూ వేడెక్కిస్తోంది. బాహుబ‌లి స్టార్ న‌టించిన సినిమాగా `సాహో` గురించి అక్క‌డ మార్మోగిపోతోంది. సాహో ట్రైల‌ర్ రిలీజ‌య్యాక ఆ ఉత్కంఠ ఇంకా పెరిగింది. సుజీత్ గురించి ప్ర‌స్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలు ఆరాలు తీయ‌డం మొద‌లై ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. సాహో రిలీజై హిట్టు అన్న టాక్ వ‌స్తే చాలు ఇక ఈ యంగ్ డైరెక్ట‌ర్ క్రేజు ఎలా ఉంటుందో ఊహించగలం. ఇప్ప‌టికే ఖాన్ ల త్ర‌యం స‌రైన హిట్లు లేక ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా షారూక్.. అమీర్ ఖాన్ లాంటి స్టార్లు స‌క్సెస్ లేక‌ ఉత్త‌రాది ద‌ర్శ‌కులపై న‌మ్మ‌కం కుద‌ర‌క ద‌క్షిణాది ట్యాలెంట్ కోసం చూస్తున్నారు. పైగా ఇక్క‌డ హిట్టు కొట్టిన సినిమాల్ని నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో సుజీత్ లాంటి యంగ్ డైరెక్ట‌ర్ కి ఖాన్ లు ఛాన్సిచ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నే లేదు.

తాజాగా కింగ్ ఖాన్ షారూక్ మెల్‌బోర్న్ లో జ‌రుగుతున్న ఇండియ‌న్ ఫిలింఫెస్టివ‌ల్ (IIFM)లో ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రైనా యాక్ష‌న్ స్క్రిప్టు ఉంటే రండి.. నాతో సినిమా చేయండి! అంటూ ఆఫ‌ర్ ఇచ్చారు. కిక్ యాస్ స్క్రిప్టు కావాలి.. నాకు ఎవ‌రూ స‌రైన యాక్ష‌న్ స్క్రిప్టు చెప్ప‌డం లేదు.. అంటూ ఆవేద‌న చెందారు బాద్ షా. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విధంగా స్పందించారు. అయితే సాహో లాంటి భారీ యాక్ష‌న్ సినిమా తీశాడు సుజీత్. బాద్ షాకి యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్ ఏదైనా స్క్రిప్ట్ వినిపిస్తే బావుంటుందేమో. ఇప్పుడున్న మూవ్ మెంట్ లో సాహో హిట్టు కొడితే షారూక్ ఛాన్సిచ్చేందుకు వెన‌కాడ‌రు. న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల్లో ట్యాలెంట్ ఉంటే ప్రోత్స‌హించే హీరోగానూ అత‌డికి పేరుంది. చూడాలి.. కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెబుతుందేమో. సాహో ఆగ‌స్టు 30న రిలీజ‌వుతోంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ