fbpx
Home Cinema స‌ల్మాన్‌తో క‌త్రిన బంధం.. అలా ఓపెన్ అయ్యిందే!

స‌ల్మాన్‌తో క‌త్రిన బంధం.. అలా ఓపెన్ అయ్యిందే!

స‌ల్మాన్‌తో బంధం ప్ర‌త్యేక‌మైన‌ది: క‌త్రినా

కొన్ని జంట‌ల్ని తెర‌పై చూస్తుంటే వంద‌శాతం పెర్ఫెక్ట్ అని అనిపిస్తుంది. అలాంటి జంటే స‌ల్మాన్‌ఖాన్, క‌త్రినా కైఫ్‌. స‌ల్మాన్ సాయంతోనే క‌త్రిన పెద్ద స్థాయికి ఎదిగింది. రెండు ద‌శాబ్ధాల పాటు క‌త్రినా కైఫ్ బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ గా నిల‌దొక్కుకుంది. అయితే స‌ల్మాన్‌ని ఈ భామ‌ పెళ్లాడ‌బోతోందంటూ సాగిన ప్ర‌చారంతో బాలీవుడ్‌లో గొప్ప‌ పాపులారిటీని సొంతం చేసుకుంది. కానీ ఆ త‌రువాత స‌న్నివేశం తెలిసిందే. యంగ్ హీరో ర‌ణ్‌బీర్‌సింగ్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోవ‌డంతో స‌ల్మాన్ ఇక మ‌రొక‌రిని చూసుకోవాల్సిందే అంటూ బాలీవుడ్ మొత్తం కోడై కూసింది. అయినా స‌ల్మాన్ మాత్రం క‌త్రినాను దూరం పెట్ట‌లేదు. త‌న సినిమాల్లో అవ‌కాశాలు ఇస్తూనే వున్నాడు.

అత‌డు జీవిత‌కాల స్నేహితుడు

వారిని తెర‌పై చూడాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే విష‌యం గురించి, స‌ల్మాన్‌తో త‌నకున్న అనుబంధం గురించి క‌త్రినా ఆస‌క్తిక‌ర విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టింది. ఇటీవ‌ల సింగ‌పూర్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో క‌త్రినా స‌ల్లూభాయ్‌తో త‌న అనుబంధంపై ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. స‌ల్మాన్‌తో నాకున్న అనుబంధం ప్ర‌త్యేక‌మైన‌ది. ఇత‌రుల క‌ష్టాల‌ని అర్థం చేసుకునే త‌త్వ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం కావ‌చ్చు. నాకెవ‌రు తెలియ‌ని స‌మ‌యంలో స‌ల్మాన్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. నా ప‌రిస్థితిని అర్థం చేసుకున్న స‌ల్మాన్ అప్ప‌టి నుంచి నా వెన్నంటే వున్నారు. ఆయ‌న నా జీవిత కాల స్నేహితుడు. స‌ల్మాన్ చెల్లెళ్ల‌తో నాకు మంచి అనుంధం వుంది. వారిని నా చెల్లెళ్లుగా భావిస్తాను. తెర‌పై మా మ‌ధ్య వుండే కెమిస్ట్రీకి, బ‌య‌ట మా అనుబంధానికి చాలా తేడా వుంటుంది` అని చెప్ప‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. క‌త్రిన త‌దుప‌రి కిలాడీ అక్ష‌య్ స‌ర‌స‌న సూర్య‌వంశీ అనే భారీ చిత్రంలో న‌టిస్తోంది. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా 2020 మార్చిలో రిలీజ్ కానుంది. 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ