fbpx
Home Cinema కంగ‌న మొండిప‌ట్టు ప‌డుతోందా?

కంగ‌న మొండిప‌ట్టు ప‌డుతోందా?

టైటిల్ కోసం మొండిగా విభేధిస్తోంది!

బాలీవుడ్ లో కాంట్రవ‌ర్సీల‌కు కేరాఫ్ అడ్ర‌స్ కంగ‌న ర‌నౌత్. ఈ మ‌ధ్య కాలంలో బాలీవుడ్ లో ఆమె చేసినంత ర‌చ్చ మ‌రెవ‌రూ చేయ‌లేదు. హృతిక్‌తో ల‌వ్‌స్టోరీ నుంచి నిన్ని మొన్న‌టి `మ‌ణిక‌ర్ణిక‌` వివాదం వ‌ర‌కు కంగ‌న చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. త‌ను ఏది చేసినా తూటాలు పేల్చ‌డ‌మే తెలుసు. వివాదాల మార్గంలో దూకుడుగా అడుగులు వేస్తూ సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. దాంతో ఆమెతో వ్య‌వ‌హారం అంటేనే బాలీవుడ్ బిగ్గీస్ జంకుతున్నారు. ఇదిలా వుంటే కంగ‌న తీరు `త‌లైవి` మేక‌ర్స్‌కి త‌ల‌నొప్పిగా మారింది. కంగ‌న తాజాగా మేటి క్లాసిక్ క‌థానాయిక‌, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో న‌టిస్తోంది.

ద‌ర్శ‌కుడు ఏ.ఎల్‌.విజ‌య్ ఈ చిత్రాన్నితెర‌పైకి తీసుకొస్తున్నారు. అక్టోబ‌ర్‌లో షూటింగ్‌ మొద‌లు కాబోతోంది. 100 మంది డ్యాన్స‌ర్‌లు.. కంగ‌న పాల్గొన‌గా రెట్రో సాంగ్‌ని తొలిగా చిత్రీక‌రించాల‌ని ద‌ర్శ‌కుడు విజ‌య్ ప్లాన్ చేస్తున్నారు. త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తెలుగు, త‌మిళ భాష‌ల్లో `త‌లైవి` అనే టైటిల్‌ని మేక‌ర్స్ డిసైడ్ చేశారు. అయితే అదే పేరుని హిందీ వెర్ష‌న్‌కి కూడా పెట్టాల‌ని కంగ‌న మేక‌ర్స్‌తో మొండిగా వాదిస్తోందిట‌. మేక‌ర్స్ మాత్రం హిందీ వెర్ష‌న్‌కి వేరే పేరు పెట్టాల‌నుకుంటున్నారు. కంగ‌న మాత్రం అదే పేరు పెట్టాల్సిందే అంటూ వాదిస్తోంద‌ట‌. మ‌రి టైటిల్ విష‌యంలో కంగ‌న వాద‌న నెగ్గుతుందో లేక మేక‌ర్స్ త‌మ పంతాన్ని నెగ్గించుకుంటారో చూడాలి.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ