fbpx
Home Cinema అక్కినేని హీరోతో సినిమా అంటే దేవాక‌ట్టా ఏమ‌న్నారో!

అక్కినేని హీరోతో సినిమా అంటే దేవాక‌ట్టా ఏమ‌న్నారో!

దేవాక‌ట్టా ఈజ్ బ్యాక్ ఎగైన్

ప్ర‌స్థానం లాంటి క‌ల్ట్ క్లాసిక్ ని తెర‌కెక్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందారు దేవాక‌ట్టా. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా అత‌డిని అభిమానించే వాళ్లు ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. ఎమోషన్.. కామెడీ.. రొమాన్స్ ఈ మూడింటిని త‌న‌దైన మార్క్ తో తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో దేవాకి ప్ర‌త్యేక‌మైన శైలి ఉంది. అది ఎంతో యూనిక్ గానూ ఉంటుంది. వెన్నెల‌, ప్ర‌స్థానం లాంటి చిత్రాలు దానిని నిరూపించాయి. నాగ‌చైత‌న్య‌- స‌మంత జంట‌గా న‌టించిన ఆటోన‌గ‌ర్ సూర్య బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైనా ఆ సినిమాలో ఎమోష‌న్, లవ్, రొమాన్స్ ప్ర‌తిదీ ఆక‌ట్టుకున్నాయ‌న్న ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. దుర‌దృష్ట‌వ‌శాత్తూ అత‌డు ఆశించిన స్థాయి బాక్సాఫీస్ విజ‌యాల్ని అందుకోలేద‌న్న‌ది వాస్త‌వం.

సాయిధ‌ర‌మ్‌తో క‌మ‌ర్షియ‌ల్ సినిమాయేనా?

ఇటీవ‌ల దేవాక‌ట్టా ప్ర‌స్థానం హిందీ రీమేక్ పై దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే. సంజ‌య్ దత్, అలీ ఫ‌జ‌ల్, అమైరా ద‌స్తూర్, మ‌నీషా కొయిలారా త‌దిత‌ర భారీ కాస్టింగ్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొన్న రిలీజైన టీజ‌ర్ .. ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నాయి. టాలీవుడ్ ప్ర‌స్థానం కంటే హిందీ ప్ర‌స్థానంలో ఎమోషన్ మ‌రింత బావుంద‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ సినిమాని హిందీ ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టు దేవాక‌ట్టా రూపొందిస్తున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ముగింపు ద‌శ‌లో ఉంది. ఈనెల 20న ప్ర‌స్థానం ఉత్త‌రాదిన ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజవుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకించి దేవాక‌ట్టా క్యూ అండ్ ఏ పేరుతో ట్విట్ట‌ర్ లో అభిమానుల్ని ప‌ల‌క‌రించారు. ఇక్క‌డ దేవాకి ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. ఇందులో అక్కినేని హీరోతో మ‌ళ్లీ సినిమా చేయాల‌ని ఓ అభిమాని ఆకాంక్షించారు. అందుకు దేవాక‌ట్టా రిప్ల‌య్ ఆస‌క్తిక‌రం. హోప్ ఫుల్లీ అంటూ రిప్ల‌య్ ఇచ్చారు దేవా. నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా దేవాక‌ట్టా రూపొందించిన‌ ఆటోన‌గ‌ర్ సూర్య బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. ఆ ఫ్లాప్ అత‌డిని తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. అత‌డు ఆ సినిమాని ఎంత బాగా తెర‌కెక్కించినా .. ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ మిస్ ఫైరైందని విమ‌ర్శ‌లొచ్చాయి. ఇక‌పోతే హిందీ ప్ర‌స్థానంతో హిట్టు కొడ‌తాన‌ని దేవాక‌ట్టా ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే సంజయ్ ద‌త్ సైతం దేవా ప్ర‌తిభ‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక ఈ సినిమా త‌ర్వాత సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ ని డైరెక్ట్ చేసేందుకు దేవాక‌ట్టా రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉంటుంది? క‌మ‌ర్షియ‌ల్ సినిమాయేనా? ఇందులో పాట‌లు, ఫైట్స్ అసంద‌ర్భంగా ఉంటాయా? అంటూ ఓ అభిమాని ప్ర‌శ్నిస్తే.. సోష‌ల్ అండ్ ఫ్యామిలీ డ్రామా తీస్తున్నాన‌ని తెలిపారు. .. ఒక మంచి సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్ అవుతుంది. అన‌వ‌స‌రంగా పాట‌లు, ఫైట్స్ అస్స‌లు పెట్ట‌ను అని జ‌వాబిచ్చారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}