Home Cinema హీరోయిన్ మాజీ భ‌ర్త‌.. కెన్యా డ్ర‌గ్ డాన్ కోసం పోలీస్ వేట‌!

హీరోయిన్ మాజీ భ‌ర్త‌.. కెన్యా డ్ర‌గ్ డాన్ కోసం పోలీస్ వేట‌!

హాట్ హీరోయిన్ హ‌బ్బీ కెన్యా డ్ర‌గ్స్ డీల‌ర్ ఇండియాలో?

ముంబై నుంచి బెంగళూరు.. అట్నుంచి ఇత‌ర మెట్రో న‌గ‌రాలు.. ముఖ్యంగా రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్ కి డ్ర‌గ్స్ ఎలా చేరుతోంది?.. టాలీవుడ్ కి డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తోంది ఎవ‌రు? ఎవ‌రైనా ఆ గుట్టు విప్ప‌గ‌ల‌రా? అంటే అంతా గ‌ప్ చుప్ వ్య‌వ‌హార‌మే ఇదంతా. రాజ‌ధానిలో డ్ర‌గ్ మాఫియా క‌థ‌లు ఈరోజు కొత్త‌గా వినాలా? టాలీవుడ్ ని ప‌ట్టి కుదిపేసిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం గురించి ఇప్ప‌టికీ తెలుగు సినీ మీడియాలో నిరంత‌రం ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటారు. ఏ తీగ లాగినా దానికి డొంకంతా నైజీరియా.. కెన్యా డ్ర‌గ్ గ్యాంగ్స్ నుంచే క‌దులుతూ ఉంటుంది. తూర్పు ఆసియా తీర ప్రాంతం నుంచి ఇండియాకి డ్రగ్స్ చేరుతుంది. అట్నుంచి అది అన్ని మెట్రో న‌గ‌రాల‌కు స‌ర‌ఫ‌రా అవుతుంటుంది. తాజాగా అలాంటి తీగ ఒక‌టి పోలీసుల చేతికి చిక్కింది. ఆ తీగ ఇక్క‌డ కాదు. ఇండియా స‌ముద్ర తీరం నుంచి వెతికుతూ వెళితే.. అటువైపు చివ‌రిగా తాకే కెన్యా దేశంలో ఉంది.

అక్క‌డ‌ డ్ర‌గ్స్ మాఫియా లింకును ప‌ట్టి క‌దిపేస్తున్నారు కెన్య‌న్ పోలీస్. త‌మ దేశంలో ఉన్న డ్ర‌గ్ ట్రాఫికింగ్ కి కార‌కులై అరాచ‌కాలు సృష్టిఇస్తున్న‌ కీల‌క డ్ర‌గ్ మాఫియా ముఠాల్ని ఏరివేయ‌డ‌మే ధ్యేయంగా కెన్య‌న్ ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకుంది. ఇప్ప‌టికే కెన్యా పోలీస్ బ‌ల‌గాలు నేరుగా బ‌రిలోకి దిగి అరెస్టుల ఫ‌ర్వం కొన‌సాగిస్తోంది. దీంతో డ్ర‌గ్ డీల‌ర్ల డొంకంతా క‌దుల్తోంది. ఇప్ప‌టికే 18 మంది నొటోరియ‌స్ డ్ర‌గ్ మాఫియా డాన్ ల‌ను వ‌ల‌ప‌న్ని ప‌ట్టేశారు. విదేశాల‌కు పారిపోయి త‌ల‌దాచుకుంటున్న కొంద‌ర‌నీ వేటాడుతున్నారు.

ఆస‌క్తిక‌రంగా ఈ లింకులో ఓ టాలీవుడ్ హీరోయిన్ మాజీ భ‌ర్త‌ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అస‌లు ఇంత‌కీ ఎవ‌రా హీరోయిన్‌? ఎవ‌రా డ్ర‌గ్ డాన్? అన్న‌ది ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిశాయి. ఆ హీరోయిన్ పేరు కిమ్ శ‌ర్మ‌. టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `ఖ‌డ్గం` చిత్రంలో క‌థానాయిక‌. ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టించిన కిమ్ మాజీ భ‌ర్త , డ్ర‌గ్స్ డాన్ అలీ పుంజానీ కెన్య‌న్ అన్న సంగ‌తి తెలిసిందే. అలీ పుంజానీ నుంచి విడిపోయిన కిమ్ శ‌ర్మ టాలీవుడ్ యంగ్ హీరో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణేతో ఎఫైర్ సాగించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కిమ్ అత‌డి నుంచి కూడా విడిపోయింది.

తాజాగా మ‌రోసారి కిమ్ పేరు త‌న మాజీ భ‌ర్త వ‌ల్ల ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చింది. కెన్యా పోలీసులు డ్ర‌గ్ డీల‌ర్స్ ని అరెస్ట్ చేస్తుంటే కిమ్ మాజీ భ‌ర్త అలీ పుంజానీ నేరుగా ముంబైలో అడుగు పెట్టాడు. అక్క‌డ ఒక ఆస్ప‌త్రిలో చికిత్స కోసం వ‌చ్చానంటూ నాట‌కం మొద‌లు పెట్టాడ‌ట‌. దీంతో అత‌డిని తిరిగి కెన్యాకు ర‌ప్పించేందుకు పోలీసులు వేట మొద‌లు పెట్టారు. అలీ పుంజానీ తిరిగి దేశానికి రావాల‌ని అల్టిమేటం జారీ చేశారు. అత‌డు స్థానికంగా ఉంటే వ‌చ్చి లొంగిపోవాలి. ఒక‌వేళ విదేశాల్లో ఉంటే స్వ‌దేశానికి రావాల్సిందేనంటూ పోలీసులు వార్నింగ్ జారీ చేశారు. కెన్యా తీరంలో ప్ర‌ధాన న‌గ‌రం మొంబాసాలో సాగిన అరెస్టుల ఫ‌ర్వంలో మోస్ట్ డేంజ‌ర‌స్ డ్ర‌గ్ డాన్స్ బ‌క్తాష్ – ఇబ్ర‌హీమ్ ఆకాషా బ్ర‌ద‌ర్స్ దొరికిపోవ‌డంతో అలీ పుంజానీ పేరు బ‌య‌ట‌ప‌డింది. వాస్త‌వానికి ఆ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ మొంబాసాలో అలీ పుంజానీ ఆపోజిట్ గ్యాంగ్. ఈ రెండు గ్యాంగ్ లు చాలాకాలంగా డ్ర‌గ్స్ వ్యాపారంలో ప్ర‌త్య‌ర్థులుగా ఉన్నారు. దీంతో అలీ పుంజానీ గుట్టు మొత్తం స‌ద‌రు బ్ర‌ద‌ర్స్ బ‌య‌ట‌పెట్టాశారు. తూర్పు ఆఫ్రికా- ఆఫ్ఘ‌నిస్తాన్, అమెరికా, యూరఫ్ దేశాల్లో ఈ గ్యాంగ్ లు డ్రగ్స్ స‌ర‌ఫ‌రా చేస్తూ అరాచ‌కాలు సృష్టిస్తున్నారని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. 2014-15 లో డ్ర‌గ్ గ్యాంగ్స్ అరాచ‌కాలు పెట్రేగాయి. అవి ఇప్పుడు పీక్స్ కి చేర‌డంతో పోలీసులు డ్ర‌గ్స్ ట్రాఫికింగ్ కీల‌క ముఠాల్ని ఏరివేయ‌డం ప్రారంభించాయి. అలా కిమ్ శ‌ర్మ మాజీ భ‌ర్త అలీ పుంజానీ సైతం మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర‌డంతో ప్ర‌స్తుతం అత‌డి గురించి పోలీస్ వేట సాగుతోంది. అలీ పుంజానీ త‌న‌కు తానుగానే కెన్యా వ‌చ్చి పోలీసుల‌కు లొంగిపోతాడో స‌రేస‌రి .. లేదంటే తీవ్ర‌మైన ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. ఆ మేర‌కు ముంబై పోలీస్ అధికారులు అలెర్ట‌య్యార‌ని ప్ర‌ఖ్యాత ముంబై మిడ్ డే ప్ర‌చురించిన క‌థ‌నం సంచ‌ల‌న‌మైంది.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ