fbpx
Home Cinema హిట్టు ప‌ట్టిన శీను.. అల్లుడు అయ్యే త‌రుణం

హిట్టు ప‌ట్టిన శీను.. అల్లుడు అయ్యే త‌రుణం

హిట్టు ప‌ట్టాడు.. పిల్ల‌ను వెతుకుతున్నాడు!

స‌క్సెస్ ఇచ్చే కిక్కే వేరు. ఆ కిక్కులో ఏమైనా చేయొచ్చు. వ‌రుస ప‌రాజ‌యాల‌తో విసుగెత్తిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఎట్ట‌కేల‌కు `రాక్ష‌సుడు` సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా చెప్పుకోద‌గ్గ స్థాయిలోనే షేర్ వ‌సూలు చేసి ఇంకా స్ట‌డీగా వ‌సూళ్లు సాధిస్తోంది. నాన్ థియేట్రిక‌ల్ తో నిర్మాత‌లు భారీగానే వెన‌కేసుకున్నారు. థియేట్రిక‌ల్ ర‌న్ ప‌రంగానూ పంపిణీదారులు సేఫ్ అయ్యే ఛాన్సుంద‌న్న ప్ర‌చారం ఉంది. దీంతో ఈ విజ‌యం బెల్లంకొండ కాంపౌండ్ లో ఎంతో ఉత్సాహం నింపింది. ఇక ఇదే హుషారులో గుడ్ న్యూస్ కూడా వినిపించారు. అది కూడా డాడ్ బెల్లంకొండ సురేష్ నోటి నుంచి ఆ శుభ‌వార్త విన‌డం శీనూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

శ్రీ‌ను హిట్టు అందుకున్నాడు. ఇక పెళ్లి చేసేయాల‌నుకుంటున్నా! అని బెల్లంకొండ సురేష్ స్వ‌యంగా నేటి మీడియా ఇంట‌ర్వ్యూలో తెలిపారు. హిట్టొచ్చిన వేళ పిల్ల‌ను వెత‌కాల‌న్న ప్లాన్ బాగానే ఉంది కానీ.. ఇంత‌కీ పిల్ల క్వాలిటీస్ ఎలా ఉండాలి? అంటేనే పెద్ద షాకిచ్చారు. శీనూకి ఇండ‌స్ట్రీ పిల్ల‌ను కాదు.. బ‌య‌టి పిల్ల‌నే వెతుకుతున్నాన‌ని చెప్పారు. అయితే శ్రీ‌ను ఇదివ‌ర‌కూ చంద‌మామ‌ కాజ‌ల్ ని ప్రేమిస్తున్నాడ‌ని ప్ర‌చారం సాగింది. కాజల్ అంటే క్ర‌ష్ అని మీడియా ఎదుటే చెప్పాడు. మ‌రి ఇప్పుడు కాజ‌ల్ ని కాద‌ని ఇంకెవ‌రిని వెతుకుతున్నారో? ఇక‌పోతే కాజ‌ల్ ని పెళ్లాడ‌తాన‌ని శ్రీ‌ను డాడ్ కి చెప్ప‌లేదా? అంటే అందుకు ఛాన్సే లేదుట‌. అవ‌న్న గాసిప్స్ మాత్ర‌మేన‌ని తెలుస్తోంది. ఇక శ్రీ‌నూకి హిట్టొచ్చిన వేళ మ‌రో శుభ‌వార్త కూడా క్యూలోకొచ్చింది. అదే త‌మ్ముడు బెల్లంకొండ గ‌ణేష్ ని కూడా బ‌రిలో దించేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం శ్రీ‌నివాస్ కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీగా ఉన్నాడు. వ‌రుస‌గా మూడు సినిమాల‌కు క‌మిట‌య్యాడ‌ట‌.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ