fbpx
Home Cinema Gossips ఆర‌బోత‌లో రెచ్చిపోయినా రిజ‌ల్ట్ జీరో!

ఆర‌బోత‌లో రెచ్చిపోయినా రిజ‌ల్ట్ జీరో!

క‌న్న‌డ హాట్ బ్యూటీ తెలుగులో పాగా వేయాల‌ని ఆప‌సోపాలు ప‌డుతోంది. అదే క‌న్న‌డ నుంచి వ‌చ్చిన ర‌ష్మిక వ‌రుస అవ‌కాశాల్ని సొంతం చేసుకుంటూ మాంచి రైజింగ్‌లో వుంటే త‌న‌లా కాక‌పోయినా కాస్త‌యినా త‌న‌కు టాలీవుడ్‌లో చోటు ద‌క్కాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. నాగార్జున న‌టించిన చిత్రం మ‌న్మ‌థుడు-2. ఈ చిత్రం ద్వ‌రా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది హాటీ అక్ష‌రా గౌడ‌. తొలి ఎంట్రీతోనే రెచ్చిపోయి అందాల విందు చేసింది. నాగ్‌తో లిప్‌లాక్‌లు, బెడ్ సీన్‌ల‌తో ఓ రేంజ్‌లో ర‌చ్చ చేసింది. త‌ను ఎలాంటి పాత్ర‌లు చేయ‌డానికైనా రెడీ అనే సంకేతాల్ని అందించింది.

అయితే అంత‌గా రెచ్చిపోయి న‌టించినా మ‌న్మ‌థుడు-2 బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టేసి దారుణంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమాతో తెలుగులో వ‌రుస ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకోవాల‌ని అక్ష‌రా గౌడ్ ప్ర‌య‌త్నాల్నీ బూడిద‌లో పోసిన ప‌న్నీర‌య్యాయి. రెచ్చిపోయి వ‌ల్గ‌ర్ సీన్ చేసినా తెలుగులో ఏ నిర్మాత కూడా అక్ష‌ర‌కు అవ‌కాశం ఇచ్చేందుకు ముందుకు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింద‌ట‌. అయినా ఎక్క‌డా నిరుత్సాహ‌ప‌డ‌కుండా అక్ష‌రా గౌడ్ త‌న హాట్ హాట్ ఫొటో షూట్‌ల‌తో రెచ్చిపోతోంది. ఇలాగైనా నిర్మాత‌లు, హీరోలు, ద‌ర్శ‌కులు త‌న బుట్ట‌లో ప‌డి అవ‌కాశాలు ఇస్తార‌ని భారీ ప్ర‌య‌త్నాలే చేస్తోంది. ఇన్ స్టాలో అక్ష‌ర పోస్ట్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇలా అయినా టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ అక్ష‌ర‌కు అవ‌కాశాలు ఇస్తారేమో చూడాలి.  

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}