Home Cinema ద‌స‌రా పోస్ట‌ర్స్: మ‌హేష్‌, బ‌న్ని, బాల‌య్య అద‌ర‌హో

ద‌స‌రా పోస్ట‌ర్స్: మ‌హేష్‌, బ‌న్ని, బాల‌య్య అద‌ర‌హో

ద‌స‌రా ఉత్స‌వం సంబ‌రంగా

 
విజ‌య‌ద‌శ‌మి సెంటిమెంటు గురించి తెలిసిందే. ఊరూ వాడా ద‌స‌రా ఉత్స‌వం సంబ‌రంగా సాగుతోంది. అయితే టాలీవుడ్ లో కొత్త సినిమాల ముహూర్తాల‌కు హ‌డావుడి సాగుతోంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 8న అర‌డ‌జ‌ను సినిమాల ఓపెనింగులు జ‌ర‌గ‌నున్నాయి. ప‌నిలో ప‌నిగా ద‌స‌రాను పుర‌స్క‌రించుకుని ప‌లు భారీ చిత్రాల‌ పోస్ట‌ర్ల‌ను  రిలీజ్ చేసారు. అల్లు అర్జున్, మ‌హేష్, బాల‌కృష్ణ స‌హా ప‌లువురు స్టార్లు న‌టించిన పోస్ట‌ర్లు రిలీజ‌య్యాయి.  డెబ్యూ హీరో ఆనంద్ దేవ‌రకొండ కొత్త సినిమాని ప్ర‌క‌టించారు. 
 
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 105వ సినిమా కొత్త పోస్ట‌ర్ ని లాంచ్ చేశారు. బాల‌య్య బాబు క‌త్తి చేత‌ప‌ట్టిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. ద‌స‌రా సంబ‌రాల్లో రంగులు పులుముకున్న రూపంతో ఆయ‌న క‌నిపించారు. కేఎస్.ర‌వికుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో బాల‌కృష్ణ క్లాస్ మాస్ అవ‌తారాల్లో క‌నిపించ‌నున్నారు. టైటిల్ ప్ర‌క‌టించాల్సి ఉండ‌గా.. రిలీజ్ తేదీ పైనా క్లారిటీ రావాల్సి ఉంది. 
 
 
సూప‌ర్ స్టార్ మ‌హేష్ – అనీల్ రావిపూడి- అనీల్ సుంక‌ర్ -దిల్ రాజు ప్రాజెక్ట్ స‌రిలేరు నీకెవ్వ‌రు కొత్త పోస్ట‌ర్ రిలీజైంది. ఈ పోస్ట‌ర్లో మ‌హేష్ క‌ర్నూలు కొండారెడ్డి బురుజు వ‌ద్ద ఫైటింగ్ మోడ్ లో ఉన్నారు. గొడ్డ‌లి ప‌ట్టి ఈవిల్ సంహారంలో బిజీ గా క‌నిపిస్తున్నాడు. క‌శ్మీర్ బార్డర్ లో సైనికుడు కాస్తా ఇలా సీమ‌కు వ‌చ్చి పోరాటం సాగిస్తున్నాడంటే పెద్ద క‌థే ఉంద‌ని అనుకోవాలి. 
 
 
అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పురంలో` పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. క్రికెట్ ఆట మైదానంలోకి వెళ్లి చిత‌క్కొట్టేస్తున్నాడు. యాక్ష‌న్ మోడ్ లో ఉన్న బన్ని పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. అందులో స్టైలిష్ లుక్ మైమ‌రిపిస్తోంది. త్రివిక్ర‌మ్ మ‌రోసారి త‌న‌దైన మ్యాజిక్ చేయ‌బోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. 
 
 
మ‌హేష్, అల్లు అర్జున్ సినిమాల్ని సంక్రాంతి రేసులో ఖాయం చేశారు. అలాగే బాల‌కృష్ణ సినిమా రిలీజ్ తేదీని ప్ర‌క‌టించాల్సి ఉంది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌లు వేగంగా సాగుతున్నాయి. ద‌స‌రా పండ‌గ‌ను తెలుగింటి లోగిళ్ల‌కు తెచ్చారు. ఇక దేవ‌ర‌కొండ న‌టించే కొత్త సినిమా కామెడీ థ్రిల్లర్ జోన‌ర్ దానికి కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.
 
 

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ