Home Cinema న‌న్ను కొట్టినప్పుడు చాలా ఆనంద‌ప‌డ్డా- డియ‌ర్ కామ్రేడ్ విల‌న్ రాజ్ అర్జున్‌

న‌న్ను కొట్టినప్పుడు చాలా ఆనంద‌ప‌డ్డా- డియ‌ర్ కామ్రేడ్ విల‌న్ రాజ్ అర్జున్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌ అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌గా నిర్మించారు. ఈ చిత్రాన్ని జూలై 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేశారు. కాగా, ఇందులో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో రాజ్ అర్జున్ అనే బాలీవుడ్ న‌టుడు న‌టించారు. ఈ చిత్రం హిట్ అయిన సంద‌ర్భంగా మీడియాతో చిట్ చాట్‌… మీకు సినీ రంగ‌ప్ర‌వేశం ఎలా అయింది ?
భోపాల్ మా సొంత ఊరు. చిన్న‌ప్ప‌టి నుంచి నాకు న‌ట‌న అంటే చాలా ఇష్టం. స్టేజ్‌ ఆర్టిస్ట్‌గా కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. ఆ త‌ర్వాత ముంబ‌యిలో ప‌దిహేను సంవ‌త‌స‌రాలు ఉన్నాను. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించాను కాని నాకు అమీర్‌ఖాన్ న‌టించిన సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌లో విల‌న్ క్యారెక్ట‌ర్‌లో చేశాను. ఆ పాత్ర నాకు మంచి పేరుని తీసుకొచ్చింది. ఆ పాత్ర‌తో నాకు ఒక యాక్ట‌ర్‌గా మంచి పేరు వ‌చ్చింది. డియ‌ర్ కామ్రేడ్‌లో అవ‌కాశం ఎలా ద‌క్కింది?
ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ సూప‌ర్ సీక్రెట్ సినిమా చూశారు. అందులో నా పెర్ఫార్మెన్స్ న‌చ్చి నాకు ఫోన్ చేసి పిలిపించారు. అలా ఆ సినిమా ద్వారా నాకు అవ‌కాశం వ‌చ్చింది. ఇందులో మ‌హిళ‌ల‌ను వేధించే పాత్ర‌లో న‌టించారు. .. నిజ జీవితంలో అలాంటివి ఎప్పుడైనా ఎదుర్కున్నారా?
ఇటువంటివి బ‌య‌ట నేను చాలానే చూశాను. ప్ర‌స్తుతం మ‌న సొసైటీలో చాలానే ఇలాంటివి జ‌రుగుతున్నాయి. ఇంకా చాలా విన్నాను. బ‌ట్ నాకు ప‌ర్స‌న‌ల్‌గా అలాంటి ఎక్స్‌పీరియ‌న్స్ ఏమీ లేదు. సినిమాల్లోకి రాక‌ముందు మీరు ఏమి చేసేవారు?
నేను భూపాల్‌లో ఉంటాను. నా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ కూడా అక్క‌డే ఉంటారు. మా ఫ్యామిలీ బిజినెస్ చూసుకునేవాడ్ని. ఇప్ప‌టికీ ఆ బిజినెస్ ఉంది మా అన్న‌య్య అవ‌న్నీ చూసుకుంటున్నారు. విజ‌య్‌దేవ‌ర‌కొండ‌లాంటి స్టార్ హీరోతో ప‌ని చెయ్య‌డం ఎలా అనిపించింది?
చాలా బావుంది. విజ‌య్ చాలా మంచి వాడు. ఎలాంటి వారినైనా గౌర‌విస్తాడు. చిన్నా, పెద్దా అని చూడ‌డు. ప్ర‌తి ఒక్క‌రినీ గౌర‌విస్తాడు. సెట్స్‌లో కూడా అంద‌రితో బాగా క‌లిసిపోతాడు. షూటింగ్‌కి కూడా చాలా డెడికేటెడ్‌గా టైమ్‌కి వ‌స్తాడు. ఒక్కోసారి త‌న పంచువాలిటీ చూస్తే నాకే ఆశ్చ‌ర్య‌మేసేది. అత‌నికి మ‌ధ్య‌త‌ర‌గ‌తి విలువ‌లు బాగా తెలుసు. అంద‌రినీ త‌న వారిలో చూస్తాడు. నాకు ఎక్క‌డా నేను ఒక పెద్ద హీరోతో న‌టిస్తున్నాను అన్న ఫీలింగ్ క‌ల‌గ‌లేదు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ర‌ష్మిక క్ల‌యిమ్యాక్స్‌లో మీ చెంప చెల్లుమ‌నిపించింది క‌దా అప్పుడు మీ రియాక్ష‌న్ ఎలా ఉంది?
ఫీల‌య్యానండి. చాలా ఆనందంగా ఫీల‌య్యా. ఎందుకంటే సినిమాలో కొన్ని కొన్ని సీన్స్‌లో నేను చాలా ఇబ్బంది పెట్టా, చాలా టార్చ‌ర్ కూడా పెట్టాను. న‌ట‌న‌లో భాగంగానే మెంట‌ల్‌గా, ఫిజిక‌ల్‌గా త‌న‌ను చాలా ఇబ్బంది పెట్టాను. త‌ను సీన్ అయిపోయాక కూడా అర‌గంట వ‌ర‌కు ఏడ్చేది. నేను మ‌ళ్ళీ త‌న ద‌గ్గ‌ర‌కు వెళ్ళి చాలా సేపు మంచిగా మాట్లాడేవాడ్ని అవి కేవ‌లం సీన్స్ మాత్ర‌మే నువు బాధ‌ప‌డివుంటే న‌న్ను క్ష‌మించు. బాధ‌ప‌డొద్దు అని చెప్పేవాడ్ని. ఆఖ‌రికి త‌ను న‌న్ను కొట్టినప్పుడు చాలా ఆనంద‌ప‌డ్డాను. హ‌మ్మ‌య్య.. త‌న కోపం అంతా పోయింది క‌దా అని. ఎక్క‌డా కూడా ఒక విల‌న్‌, హీరో, హీరోయిన్ ఫ్రెండ్స్ అవ్వ‌రు. కానీ ఈ సినిమాతో మేం ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. విజ‌య్, ర‌ష్మిక నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇండ‌స్ట్రీ నుంచి మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్‌?
త‌మిళ , తెలుగు అన్నిటి ద‌గ్గ‌ర నుంచి మంచి కాంప్లిమెంట్స్ వ‌చ్చాయి. త‌మిళ డైరెక్ట‌ర్ విజ‌య్ , న‌టుడు కృష్ణ వాళ్ళు చాలా బాగా చేశార‌ని అభినందించారు. అలాగే సినిమా అయిపోయాక‌ కొంత మంది థియేట‌ర్‌లో న‌న్ను చూసిన ఆడ‌పిల్ల‌లు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డానికి కూడా కొంద‌రు భ‌య‌ప‌డ్డారు. నేను ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్టే ఉన్నాన‌ని. కొంత‌మంది న‌న్ను క్రూయ‌ల్ మెంటాలిటీ అని అనుకుంటున్నారు. దాదాపుగా ఈ మ‌ధ్య నేను న‌టించిన మూడు చిత్రాలు కూడా అలా నెగిటివ్ క్యారెక్ట‌ర్స్ కావ‌డంతో అలా అనుకుంటున్నారు. మీకు త‌మిళ‌, తెలుగు, హిందీ ఇండ‌స్ట్రీల్లో ఏది కంఫ‌ర్ట్‌గా ఉంది?
రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన షాభీ చిత్రం మంచిగా అనిపించింది. ఆ త‌ర్వాత సూప‌ర్ సీక్రెట్ కూడా ఓకే. కాక‌పోతే నా వ‌రకు డియ‌ర్ కామ్రేడ్ తెలుగు ఇండ‌స్ట్రీ కంఫ‌ర్ట్ అనిపించింది. ప్రొడ్యూస‌ర్ మంచి వారు. పెద్ద బ్యాన‌ర్ నాకు భాష రాక‌పోయినా ఇక్క‌డ ట్రీట్‌మెంట్ చాలా బావుంది. హైద‌రాబాద్ నాకు నా సొంత ఇల్లు లా అనిపించింది. నా వ‌ర‌కు అయితే తెలుగు ఇండ‌స్ట్రీ కంఫ‌ర్ట్‌. మీ త‌ర్వాత న‌టించే చిత్రాలు?
హిందీ షీర్‌షా అనే చిత్రంలో న‌టిస్తున్నాను. కెప్టెన్ విక్ర‌మ్ బాత్రా కార్గిల్ లైఫ్ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం. అందులో నేనొక ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాను. క‌ర‌ణ్‌జొహ‌ర్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా?
డ్రీమ్ రోల్ అని ప్ర‌త్యేకించి ఏమీ లేదు. కాని నేను న‌టించే పాత్ర‌కి ఇంపార్టెన్స్ ఉండాలి. క‌థ న‌చ్చి నా పాత్ర‌కి ప్రాముఖ్య‌త ఉంటే ఏ పాత్ర‌లోనైనా న‌టిస్తా. మీరు యాక్టింగ్ ఎక్క‌డ నేర్చుకున్నారు?
ప‌దిహేనేళ్ళ పాటు భూపాల్‌లో ఆ త‌ర్వాత ఢిల్లీలో నేర్చుకున్నాను. సంజ‌య్ మెహ‌తా ద‌గ్గ‌ర నేర్చుకున్నాను. మీకు తెలుగు రాదు క‌దా ఏమైనా ఇబ్బంది అయిందా?
లేదండి. నా డైలాగ్స్ అన్నీ ముందుగానే న్యారేట్ చేసేవారు. రాము డైలాగ్స్‌కి హెల్ప్ చేశారు. దాని పై చాలా పెద్ద హోమ్ వ‌ర్క్ చేసేవాడ్ని పెద్ద‌గా భాష గురించి ఎప్పుడూ అంత‌గా ఇబ్బంది క‌ల‌గ‌లేదు అంటూ ముగించారు.

Recent Posts

ఇంటికొచ్చి ఇస్తా అన్న ఆ — ఎక్కడ?

కోవిడ్-19 విజృంభనతో దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. ఈ సమయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా నిత్యావసరాలు, అలాగే రేషన్ వంటి వాటిని అందించేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్...

ఆ మాజీ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు ముగినట్టేనా?

దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు కోటలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. మూస సిద్ధాంతాలతో మసకబారుతున్నాయి. మచ్చలేని ప్రజా నాయకులుగా వెలిగిన వారు.. పలుమార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారు.. ఇప్పుడు ఆర్థిక స్థోమత లేక...

సబ్బం హరి ఆ పని చేయడం వల్లే జగన్‌ దూరం పెట్టారా?

మంచి మాటకారిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ సబ్బం హరి మాటలు.. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాకు మంచి సరుకుగా, జగన్‌పై విమర్శలు సంధించేందుకు అస్త్రాలుగా మారుతున్నాయి. సమయం, సందర్బం అంటూ ఏదీ...

హాట్ యాంక‌ర్‌కి మెగా ఆఫ‌ర్‌!

హాట్ యాంక‌ర్ రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌కు మ‌రో మెగా ఆఫ‌ర్ త‌గిలిన‌ట్టు తెలిసింది. `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త‌గా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసి ఓ ద‌శ‌లో రామ్‌చ‌ర‌ణ్‌నే డామినేట్ చేసిన అన‌సూయ‌కు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిత్రంలో...

పుట్టిన రోజు లేదు .. పెళ్లీ కూడా వాయిదా!

ప్ర‌పంచం క‌రోనా వైర‌స్ కార‌ణంగా అల్ల క‌ల్లోలం అవుతోంది. ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌ర‌ణాలే. దేశం క‌రోనా కార‌ణంగా భ‌యంతో కంపించిపోతోంది. ఈ ప‌రిస్థితుల్లో ముఖ్య‌మైన కార్య‌క్రమాల‌న్నింటినీ జ‌నం వాయిదా వేసుకుంటున్నారు. కొన్నింటిని...

`ఉప్పెన‌`కు క‌త్తెరేస్తున్న ద‌ర్శ‌కుడు!

సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `ఉప్పెన‌`. మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయ‌న శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం...

అల్లు అర్జున్ ప్లాన్‌కి క‌రోనా దెబ్బ‌!

2020... ఈ ఇయ‌ర్ హీరో అల్లు అర్జున్‌కు.. క‌రోనా వైర‌స్‌కు చాలా స్పెష‌ల్ ఇయ‌ర్‌. మాన‌వాళికి మాత్రం కాళ‌రాత్రుల్ని ప‌రిచ‌యం చేస్తున్న ఇయ‌ర్. ఈ ఏడాది అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో...

తెలంగాణలో కరోనా తొలి మరణం వెనుక భయానక వాస్తవాలు!

తెలంగాణలో కోవిడ్-19 తొలి మరణం నమోదైంది. నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు మరణించిన అనంతరం.. చేసిన పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. పెద్ద వయసు కాబట్టి కరోనా వైరస్‌...

బీటలు వారుతోన్న తెలుగు దేశం పునాదులు..

తెలుగు దేశం పార్టీ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయాల్లో ఓ నూతన ఓరవడికి శ్రీకారం చుట్టిన ప్రాంతీయ కెరటం. తెలుగువారి 'ఆత్మగౌరవ' నినాదంతో 1982 మార్చి 9న విశ్వవిఖ్యాత నటుడు నందమూరి...

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...