fbpx
Home Cinema ‘సైరా’ సెట్ ..ఏదో యుద్దంలో ఉన్నట్లుంది! (వీడియో)

‘సైరా’ సెట్ ..ఏదో యుద్దంలో ఉన్నట్లుంది! (వీడియో)

‘సైరా’ మేకింగ్ వీడియో..చూస్తూంటే మతిపోతోంది

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబరు 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ ప్రారంభించింది. అందులో భాగంగా ఈ సినిమా మేకింగ్‌ వీడియో విడుదలైంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక్క రోజు ముందుగా ఈ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సెట్‌లో జరిగిన సంఘటనల్ని పంచుకుంది.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం ‘సైరా’. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రెండేళ్లుగా ఈ చిత్రం సెట్స్‌పైనే ఉంది. క్వాలిటీ కోసం సురేందర్ రెడ్డి సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. చివరికి చిరు మెప్పు పొందాడు సురేందర్ రెడ్డి. ఈయన తెరకెక్కించిన సీన్స్ చిరుకు తెగ నచ్చేసాయి.అలాగే ఈ రోజు ఈ మేకింగ్ వీడియో ఫ్యాన్స్ కు కూడా తెగ నచ్చేస్తోంది. మేకింగ్ వీడియోనే ఇలా ఉందంటే సైరా ఔట్ పుట్ ఎలా ఉండబోతోందో అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

రామ్‌ చరణ్‌ నిర్మాత. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}