fbpx
Home Cinema వీడియో: మెగాస్టార్ ఇంట కొత్త కాంతులు

వీడియో: మెగాస్టార్ ఇంట కొత్త కాంతులు

మెగా మ‌న‌వ‌రాలు అన్న ప్రాసాన‌

బిడ్డొచ్చిన వేళా విశేషం అంటారు! ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి మ‌న‌వ‌రాలు బేబి న‌విష్క సంద‌డి ఆ ఇంట స‌రికొత్త వినోదం పంచుతోంది. ఇదే టైమ్ లో చిరు `సైరా` రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నా… మొన్న జూలైలో త‌న మ‌న‌వ‌రాలు న‌విష్క అన్న ప్రాసాన వేడుక‌లో ఎంతో చిలౌట్ మూవ్‌మెంట్‌తో క‌నిపించారు. క‌ళ్యాణ్ దేవ్, శ్రీ‌జ జంట‌కు జ‌న్మించిన బేబి న‌విష్క అన్న ప్రాసాన‌ వేడుక‌ను కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఎంతో సింపుల్ గా నిర్వ‌హించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంప‌తులు..
శ్రీ‌జ – క‌ళ్యాణ్ దేవ్ దంప‌తులు ఈ అరుదైన సంద‌ర్భాన్ని ఆస్వాధిస్తూ క‌నిపించారు.

సంబురం అంబ‌రాన్నంటేలా..

ఇదే వేడుక‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా, కుమారుడు మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ ఒక‌టే క‌న్నుల‌పండుగ‌గా క‌నిపించారు. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, ప‌ద్మ‌జ‌ దంప‌తులు, నిహారిక‌, సుశ్మిత త‌దిత‌రులు వేడుక‌లో సంద‌డి చేస్తున్న వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది. ఈ ఈవెంట్ లో శ్రీ‌జ సోద‌రుడు రామ్ చ‌ర‌ణ్ మిస్స‌య్యారు.. అయితే మెగా హీరోలంతా ర‌క‌ర‌కాల షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

 

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ