fbpx
Home Cinema మెగాస్టార్ ఫ్యాన్స్ ఇది వింటే తట్టుకోగ‌ల‌రా?

మెగాస్టార్ ఫ్యాన్స్ ఇది వింటే తట్టుకోగ‌ల‌రా?

భుజానికి గాయ‌మా? ఫ్యాన్స్ కంగారు ప‌డే వార్త ఇది..

ఏదైనా భారీ యాక్ష‌న్‌ చిత్రంలో న‌టించేప్పుడు గాయాలు అవ్వ‌డం స‌హ‌జ‌మే. సీనియ‌ర్ హీరోలు సైతం ఇటీవ‌ల డూప్ ఉప‌యోగించేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. అయితే అలా డూప్ వాడ‌క‌పోతే ప్ర‌మాదాలు జ‌రిగితే మాత్రం పెద్ద‌ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయినా గ‌ట్ ఫీలింగ్ తో ఫైట్స్ చేసేస్తున్నారు మ‌న స్టార్లు. ఇదే తీరుగా సైరా కోసం మెగాస్టార్ చిరంజీవి చాలానే రిస్కులు చేసిన‌ట్టు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి `సైరా: న‌ర‌సింహారెడ్డి` చిత్రంలో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి అనే వారియ‌ర్ పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడిగా.. యుద్ధ వీరుడిగా తెర‌పై క‌నిపించాలి. శ‌త్రువుపై క‌త్తి దూయాలి. భీక‌ర యుద్ధంలో క‌త్తికి ఎదురెళ్లాలి. గుర్ర‌పు స్వారీలు.. కోట‌లు గ‌డీల్లో జంప్ లు వ‌గైరా వ‌గైరా యాక్ష‌న్ త‌ప్ప‌నిసరి. అయితే ఇలాంటి వేళ మెగాస్టార్ కి గాయ‌మైందో ఏమో కానీ.. ఆయ‌న భుజానికి శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించార‌ని తెలుస్తోంది. షోల్డ‌ర్ కి చికిత్స చేసినా చ‌ర‌ణ్, సురేంద‌ర్ రెడ్డి బృందం త‌న‌తో యాక్ష‌న్ స‌న్నివేశాలు చేయించార‌ని చిరు ముంబైలో జ‌రిగిన ఈవెంట్ అనంత‌రం పీటీఐకి తెలిపారు.

డూప్ ఉప‌యోగించ‌లేదా?

`సైరా` చిత్రాన్ని ఎందులోనూ రాజీకి రాకుండా చిత్రీక‌రించార‌ని.. అయితే శ‌స్త్ర చికిత్స త‌ర్వాతా తాను అలా ప‌ని చేయ‌డాన్ని ఎంజాయ్ చేశాన‌ని చిరంజీవి తెలిపారు. యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు డూప్ ని ఉప‌యోగించి ఆ త‌ర్వాత మార్ఫింగ్ చేసుకునే వెసులు బాటు ప్ర‌స్తుత సాంకేతిక‌త‌లో ఉంది. కానీ అలా చేయ‌లేద‌ని మెగాస్టార్ వెల్ల‌డించారు. మొత్తానికి భుజానికి గాయం విష‌యాన్ని ఇంత‌కుముందు ఎప్పుడూ రివీల్ చేయ‌లేదు. ఒక‌వేళ ఫ్యాన్స్ కంగారు ప‌డ‌తార‌ని అలా చెప్ప‌కుండా దాచారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}