fbpx
Home Cinema ట్రైల‌ర్ టాక్:  `బైపాస్ రోడ్` లో దెయ్యం టెన్ష‌న్

ట్రైల‌ర్ టాక్:  `బైపాస్ రోడ్` లో దెయ్యం టెన్ష‌న్

బైపాస్ రోడ్ డెవిల్ థ్రిల్లింగ్ స్టోరీ

సాహో ఫేం నీల్ నితిన్ ముఖేష్, అదాశ‌ర్మ‌, శ‌ర్మ సికంద‌ర్ సారా త‌దిత‌రులు న‌టించిన తాజా చిత్రం బైపాస్ రోడ్. నీల్ నితిన్ సోదరుడు నమన్ నితిన్ ముఖేశ్ దర్శకుడు. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ చిత్రమిది. న‌వంబ‌ర్ ఒక‌టిన రిలీజ్ కానుంది. తాజాగా ట్రైల‌ర్ రిలీజైంది.

ట్రైల‌ర్ ఆద్యంతం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, థ్రిల్ ని క‌లిగిస్తోంది. యాక్సిడెంట్ కి గురై చ‌క్రాల కుర్చీకి అంకిత‌మైన బిజినెస్ మేన్ విక్ర‌మ్ లైఫ్ లో అస‌లేం జ‌రిగింది?  త‌న‌ని వెంటాడే దెయ్యం ఎవ‌రు? అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మోడ‌ల్ సారా హ‌త్య అనంత‌రం ముఖేష్ ఎదుర్కొన్న ప‌రిణామాలు .. అస‌లు ఘోస్ట్ రూపంలో తిరిగేది ఎవ‌రు? అన్న‌ది ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఇక ఇందులో అదాశ‌ర్మ పాత్ర‌లోనూ ఏదో ట్విస్టు ఉండ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. రజిత్ కపూర్ నీల్ నితిన్ కి తండ్రి గా న‌టిస్తున్నారు. గుల్ పనాగ్ నీల్ కి త‌ల్లి గా క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రానికి నితిన్ ముఖేశ్ ర‌చ‌యిత‌. తాజాగా రిలీజైన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. నీల్ నితిన్ సోద‌రుడు ద‌ర్శ‌కుడిగా మెప్పిస్తాడేమో చూడాలి.

https://youtu.be/7QZvBOHqwz0

 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ