Home Cinema కుటుంబాన్ని పోషించుకునేందుకు వాచ్ మెన్ గా మారిన బాలీవుడ్ నటుడు

కుటుంబాన్ని పోషించుకునేందుకు వాచ్ మెన్ గా మారిన బాలీవుడ్ నటుడు

తాను సినిమా నటుడ్నని ఆయన నామోషీ పడలేదు. బతుకుదెరువు కోసం వాచ్‌మేన్‌గా మారాడు. అతనే బాలీవుడ్ నటుడు సవీ సిద్ధు! సినిమా అవకాశాలు లేక కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆయన వాచ్‌మేన్‌గా మారాడు. ఆయనకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్‌తో కలిసి పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఆయన్ను వాచ్‌మేన్‌గా చూసిన నెటిజన్లు ఆవేదనకు గురయ్యారు.

దీంతో సిద్ధూకి అవకాశాలు కల్పించమంటూ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు మెసేజ్‌లు పంపుతున్నారట. దీనిపై అనురాగ్ ఆసక్తికరంగా స్పందించారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు సిద్ధు ఆ వృత్తిని ఎంచుకున్నందుకు ఆయన పట్ల గౌరవం పెరిగిందంటూనే ఓ నటుడి పట్ల జాలిపడి అవకాశాలు ఇవ్వకూడదన్నారు.

మీకేదైనా సాయం చేయాలనిపిస్తే వారి సినిమాలను చూడండంటూ సలహా కూడా ఇచ్చేశారు. ‘నా సినిమాల్లో ఆయనకు మూడు సార్లు అవకాశం ఇచ్చాను. సినిమాల్లేకుండా ఖాళీగా ఉంటున్న ఇతర నటుల్లా కాకుండా ఆయన తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఓ ఉద్యోగం ఎంచుకున్నందుకు ఆయన పట్ల నాకు గౌరవం పెరిగింది. కొందరైతే సినిమాల్లేక తాగుబోతులుగా మారుతుంటారు.

నవాజుద్దిన్‌ సిద్ధిఖి కూడా వాచ్‌మేన్‌గా, వెయిటర్‌గా పని చేసి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. రోడ్లపై భేల్‌పురి అమ్ముకుంటున్న ఓ నటుడ్ని నేను కలిశాను. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే.. సినిమాల్లేవని ఓ నటుడి పట్ల జాలి పడి అవకాశాలివ్వకూడదు. అది వారిని అవమానించినట్లవుతుంది. సిద్ధు తన జీవితాన్ని తానే రక్షించుకోవాలి.

ఆయన కోసం ఏదన్నా సాయం చేయాలనుకుంటే కాస్టింగ్‌ డైరెక్టర్ల వద్దకు తీసుకెళ్లగలం. వాచ్‌మేన్‌ అంటే చిన్న ఉద్యోగం అని తీసిపారేస్తున్నారు. అదేమీ చిన్న ఉద్యోగం కాదు. అలాగని పెద్దదీ కాదు. ఆయన అయితే అడుక్కోవడంలేదు. ఒకవేళ సిద్ధులాంటి ఆర్టిస్ట్‌లకు మీరు ఏదైనా సాయం చేయాలనుకుంటే వారు నటించిన సినిమాలను థియేటర్‌కు వెళ్లి టికెట్లు కొనుక్కుని చూడండి. అప్పుడే వారి విలువను గుర్తించి మరిన్ని అవకాశాలు ఇవ్వడానికి ముందుకొస్తారు. అంతేకానీ, ఇలా ఆయన పడుతున్న బాధలను నాకు వివరించడంలో అర్థం లేదు. నేను చెప్పదలచుకున్నది ఇంతే. ధన్యవాదాలు’ అని అనురాగ్ కుండబద్దలు కొట్టారు‌.

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

క్వారెంటైన్ టైమ్‌ని ప్ర‌భాస్ అలా గ‌డిపేస్తున్నాడ‌ట‌

`బాహుబ‌లి` త‌రువాత ప్ర‌భాస్ సినిమా స్థాయి, మార్కెట్ మారిపోయింది. ఏ సినిమా చేసినా పాన్ ఇండియా రేంజ్‌లోనే ఆలోచిస్తున్నాడు. ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నాడు. `జాన్‌` పేరుతో రూపొందుతున్న...

ఓ సెక్ష‌న్ ఆఫ్ మీడియా ప్ర‌చార‌మట‌

ఫ్లాపుల్లో వున్న సాయిధ‌ర‌మ్ తేజ్‌కు `ప్ర‌తీ రోజు పండ‌గే` చిత్రంతో హిట్‌ని అందించాడు మారుతి. ఆ త‌రువాత నుంచి ఫ్లాప్ హీరోకి హిట్ ఇచ్చాన‌ని తెగ ఫీల‌వుతున్నాడ‌ట. త‌న త‌దుప‌రి చిత్రం కూడా...

తెలుగు హీరో కోసం మ‌ళ్లీ విల‌న్ అవ‌తారం?

స్టార్ హీరో కోసం క‌న్న‌డ హీరో మ‌ళ్లీ విల‌న్‌గా మార‌బోతున్నాడ‌ని తెలిసింది. క‌న్న‌డ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విల‌క్ష‌ణ హీరోగా, ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న క‌న్న‌డ హీరో ఉపేంద్ర మరోసారి తెలుగు చిత్రంలో విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడ‌ని...

టీష‌ర్ట్ ఇలా కూడా వేసుకుంటారా?

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించ‌డంతో సామాన్యుడి నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంతా ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. సామాన్యులు రేపు ఎలా అని భ‌యంతో వ‌ణికిపోతుంటే సెల‌బ్రిటీలు మాత్రం ఈ క్వారెంటైన్...

బ్లూ ఫిల్మ్ నీ చెల్లితో తీయ‌రా! యంగ్ బ్యూటీ

సోష‌ల్ మీడియాలో హీరోయిన్లు..ఆకతాయిల మ‌ధ్య న‌డిచే వార్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హ‌నం కోల్పోయి ఒక‌ర్ని ఒక‌రు దుర్భాష‌లాడుకోవ‌డం వంటివి స‌హ‌జంగా జ‌రుగుతుంటాయి. ఆక‌తాయిల కామెంట్లు హీరోయిన్ల‌కు సైతం బూతు పురాణం అందుకునేలా...

బ‌న్నీ `ఐకాన్‌`పై క్లారిటీ వ‌చ్చేసింది!

బ‌న్నీ - సుకుమార్‌ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్రానికి బుధ‌వారం `పుష్ప‌` అనే టైటిల్ చిత్ర బృందం నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని, టైటిల్ లోగోని...

అల్లు అర్జున్‌ది ఇందులోనూ అదే స్టైలా?

బ‌న్నీ హీరోగా సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం `ఆర్య‌`. ఒక‌రు ప్రేమించిన అమ్మాయిని మ‌ధ్య‌లో వ‌చ్చి త‌ను కూడా ప్రేమిస్తున్నాన‌ని వెంట‌ప‌డే హీరో క‌థ‌. ముందు ఇది విచిత్రంగా అనిపించినా మెల్ల మెల్ల‌గా...

కాళ్లు గోడ‌కి..చేతులు నేల‌కి.. ఇదేంటి?!

లాక్ డౌన్ తో ఎవ‌రి ఇళ్ల‌లో వాళ్లు బిజీ. డైరెక్ట‌ర్లు అంతా స్ర్కిప్ట్ లు రాసుకుంటూ సినిమాలు స్ట‌డీ చేస్తున్నారు. హీరోలంతా అవేర్ నేస్ అంటూ పాఠాలు బోధిస్తున్నారు. హీరోయిన్లు అంతా యోగాలు...జిమ్ములు...

మెగాస్టార్ నే కాద‌న్నంత మ‌గాడా?

మెగాస్టార్ చిరంజీవి చెబితే ప‌రిశ్ర‌మ‌లో కాద‌నేది ఎవ‌రు? ప‌రిశ్ర‌మ పెద్ద‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత‌ అత‌ని మాట‌ని జ‌వ‌దాటేది ఎవ‌రు? అంత ధైర్యం ఎవ‌రికి ఉంది? అంటే! ఉందంటూ ఓ చిన్న చిత్రాల...

నీలాంటి వాళ్ల వ‌ల్లేరా క‌రోనాలు కాటేస్తున్నాయ్!

టిక్ టాక్ యాప్ లో జ‌రిగే వెకిలి వేషాలు గురించి తెలిసిందే. ఆ యాప్ అందుబాటులోకి వ‌చ్చిన కొత్త‌లో ఓ ప‌ద్ద‌తి ఉండేది. ఇప్పుడా ప‌ద్ద‌తి ఎక్క‌డా యాప్ లో క‌నిపించ‌లేదు. టిక్...