Home Cinema బిగ్‌బాస్ ముష్ఠి ఆట‌లేంటి? ప‌ర‌మ చిరాకు గేమ్స్

బిగ్‌బాస్ ముష్ఠి ఆట‌లేంటి? ప‌ర‌మ చిరాకు గేమ్స్

`బిగ్‌బాస్` ముష్ఠి గేమ్స్ ఏమిటో! ఎందుక‌ని తెలుగు టీవీక్ష‌కుల‌ను ఈ రొంపిలోకి దించారు? షో అంతా ఇంత ఏవ‌గింపుగా ఉన్నా.. బిగ్ బాస్ ఆట‌లు ఎంతో ర‌స‌వ‌త్త‌రం అంటూ మురికి మీడియా ప్ర‌చారం అంతే ఇదిగా సాగుతుండ‌డం సాంప్ర‌దాయవాదుల్లో చ‌ర్చ‌కొస్తోంది. ఇప్ప‌టికే తెలుగు బిగ్ బాస్ 52 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఈ బుధ‌వారంతో 53వ ఎపిసోడ్‌లోకి ఎంట‌రైంది. దీంతో టాస్క్‌ల‌ని మ‌రింత క‌ఠినత‌రం చేశారు. గ‌త ఎపిసోడ్‌లో ఇంట్లో దెయ్యం నాకేం భ‌య్యం` పేరుతో ఓ టాస్క్‌ని ఇచ్చిన బిగ్ బాస్ చివ‌రికి హౌస్‌లో వున్న వాళ్లంద‌రినీ దెయ్యాలుగా మార్చేశాడు. ఈ గేమ్‌లో జ‌రిగిన అతి కార‌ణంగా పున‌ర్న‌వి భూపాలానికి మండుకొచ్చింది. దీంతో బిగ్‌బాస్‌పై ఎదురుదాడికి దిగడం హౌస్ మేట్‌ల‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తింది. ముష్టిగేమ్‌లేంటి అంటూ ఏకంగా బిగ్‌బాస్‌పైనే ఫైర్ అయ్యింది.

పిచ్చి పిచ్చి టాస్క్‌లు వ‌ద్ద‌ని ఎదిరించింది. సిల్లీ గేమ్స్‌తో మా ఎమోష‌న్‌ని ఆడుకోవ‌ద్దు అంటూ మండిప‌డింది. ఇదిలా వుంటే పున‌ర్న‌వి, రాహుల్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర చర్చ తెర‌పైకి వ‌చ్చింది. ఇద‌ద‌రి మ‌ధ్య గ‌త కొన్ని రోజులుగా హౌస్ మేట్స్ ఏదో జ‌రుగుతోంద‌ని మాట్లాడుకుంటున్నారు. దానికి భిన్నంగా బుధ‌వారం ఇద్ద‌రు మాట్లాడు కోవ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. త‌న‌ను ఇగ్నోర్ చేస్తున్నావ‌ని రాహుల్‌, అంతా మ‌న మ‌ధ్య ఏదో వుంద‌ని అనుకుంటున్నారు కాబ‌ట్టే నీకు కొంత దూరంగా వుంటున్నాన‌ని పున‌ర్న‌వి చెప్ప‌డం హౌస్‌ మేట్స్‌ని, బిగ్‌బాస్ వీక్ష‌కుల్ని ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

ఇక ఇంట్లో దెయ్యం నాకేం భ‌య్యం` గేమ్‌ని స్పాయిల్ చేసినందుకు గానూ బిగ్‌బాస్ ముగ్గురు హౌస్ మేట్స్‌ని ప‌నిష్ చేయ‌డంతో కొత్త డ్రామా మొద‌లైంది. గేమ్‌ని అంతా బాగానే ఆడినా పున‌ర్న‌వి, శ్రీ‌ముఖి, మ‌హేష్ విట్టా చాలా తేలిక‌గా తీసుకుని ఆ గేమ్‌ని స్పాయిల్ చేశార‌ని అందుకు వారు హౌస్ మేట్‌ల షూస్ శుభ్రం చేసి పాలిష్ చేయాల‌ని పెద్ద కుప్ప‌ని వారి కోసం సిద్ధం చేశారు. అయితే శ్రీ‌ముఖి అందుకు అంగీక‌రించి ముందుకు వెళ్ల‌గా పున‌ర్న‌వి, మ‌హేష్ విట్టా మాత్రం షూస్ పాలీష్ చేయ‌డానికి ఇక్క‌డికి రాలేద‌ని మొండికేశారు. శివ‌జ్యోతి చెప్ప‌డంతో మ‌హేష్ మ‌న‌సు మార్చుకుని షూ పాలిష్ చేయ‌డానికి అంగీక‌రించాడు. కానీ పున‌ర్న‌వి మాత్రం త‌ను షూస్ పాలీష్ చేసేది లేద‌ని కావాలంటే ఈ కార‌ణం చేత త‌న‌ని ఎలిమినేట్ చేసినా త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని తేగేసి చెప్ప‌డంతో బిగ్‌బాస్ షో ఒక్క‌సారిగా వేడెక్కింది. ఈ వారం పున‌ర్న‌విని ఎలిమినేట్ చేస్తారా? లేక కంటిన్యూ చేస్తారా అన్న‌ది గురువారం తేల‌నుంది. అయితే బిగ్ బాస్ చిరాకు గేమ్స్ గురించి కేవ‌లం హౌస్ మేట్స్ మాత్ర‌మే కాదు.. బ‌య‌ట జ‌నం కూడా అంతే ఇదిగా ఫీల‌వుతుండ‌డం ఆస‌క్తిక‌రం. 

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ