fbpx
Home Cinema భార‌తీయుడు-2 క‌థ లీక్ .. శంక‌ర్ నుంచే లీకులా?

భార‌తీయుడు-2 క‌థ లీక్ .. శంక‌ర్ నుంచే లీకులా?

టీమ్‌పై ప‌ట్టు కోల్పోతున్న శంక‌ర్‌!

క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్‌ల‌ క‌ల‌యిక‌లో వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ `భార‌తీయుడు`. 23 ఏళ్ల క్రితం వ‌చ్చిన ఈ చిత్రానికి నేటి స‌మ‌కాలీన ప‌రిస్థితుల్ని ఆడాప్ట్ చేస్తూ సీక్వెల్‌ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. శంక‌ర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ఈ సినిమాకు ప్రారంభ ద‌శ నుంచే స్పీడు బ్రేకులు తెలిసిందే. `2.ఓ` ఆశించిన స్థాయి విజ‌యాన్ని సాధించ‌క‌పోవ‌డంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నలైకా ప్రొడ‌క్ష‌న్స్ బ‌డ్జెట్ ప‌రిమితులు విధించింద‌ని, లేదు లేదు ఆ ప్రాజెక్ట్‌ని అర్థాంత‌రంగా ఆపేసింద‌ని ప్ర‌చారం మొద‌లైంది. మ‌రో ప‌క్క క‌థానాయిక‌గా డేట్స్ కేటాయించిన కాజ‌ల్ అగ‌ర్వాల్ సినిమా మేకింగ్ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంద‌న్న సాకుతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది.

అయితే ఆ ప్రాచారంలో ఎలాంటి నిజం లేద‌ని సినిమా షూటింగ్ ఫుల్ స్వింగులో వుంద‌ని శంక‌ర్ సోష‌ల్ మీడియాలో భాయ‌తీయుడు-2 లుక్‌లు సోస్ట్ చేస్తూ తేల్చేశాడు. దీంతో ఈ సినిమా షూటింగ్ య‌మ స్పీడుగా సాగిపోతోంద‌ని అంద‌రికి అర్థ‌మైపోయింది. పుకార్ల‌ని దాటి షూటింగ్ స్పీడు పెంచిన ఈ చిత్రాన్ని వ‌రుస లీకులు బెంబేలెత్తించేస్తున్నాయి. భార‌తీయుడు-2 స్టోరీ ఇదే అంటూ ఓ స్టోరీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌టం ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కు త‌ల‌నొప్పిగా మారింది. త‌న ప్ర‌తి సినిమా విష‌యంలో స్ట్రిక్ట్‌గా వ్య‌వ‌హ‌రించే శంక‌ర్ `భార‌తీయుడు-2` విష‌యంలో అజాగ్ర‌త్త‌గా వున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికి త‌గ్గ‌ట్టే సినిమా స్టోరీ లీక్ కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

క‌మ‌ల్‌హాస‌న్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో పాటు ఈ చిత్రంలో సిద్ధార్థ్, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియాభ‌వాని శంక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. లీకైన స్టోరీ ప్ర‌కారం.. ఇందులో సిద్దార్థ ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌ని ర‌న్ చేస్తూ వుంటాడు. దేశ వ్యాప్తంగా త‌న‌కున్న నెట్ వ‌ర్క్ తో దేశ వ్యాప్తంగా వున్న అవినీతిప‌రులైన రాజ‌కీయ నాయ‌కుల్ని చీల్చి చండాడుతూ వాళ్ల బండారం బ‌య‌ట‌పెడుతుంటాడు. ఆ వీడియోలు చూసిన సేనాప‌తి మ‌ళ్లీ త‌ను క‌త్తి ప‌ట్టాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని రంగంలోకి దిగి హ‌త్య‌లు చేయ‌డం మొద‌లుపెడ‌తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌దే ఈ చిత్ర క‌థ అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో ర‌కుల్ సిద్ధార్థ‌కు జోడీగా క‌నిపించ‌బోతోంది. ప్రియాభ‌వాని శంక‌ర్ జ‌ర్న‌లిస్టుగా క‌నిపించ‌నుంద‌ని చెబుతున్నారు. స్టోరీ లీక్‌పై ద‌ర్శ‌కుడు శంక‌ర్ చిత్ర యూనిట్‌పై అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. శంక‌ర్ టీమ్ పై ప‌ట్టుకోల్పోవ‌డం వ‌ల్లే ఈ త‌ప్పిదం జ‌రిగిందా? లేక ఆయ‌న అజాగ్ర‌త్త‌ కార‌ణంగా జ‌రిగిందా? అని త‌మిళ మీడియా క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తోంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ