fbpx
Home Cinema మంత్రిగారి వెంట భ‌జ‌న బ్యాచ్‌

మంత్రిగారి వెంట భ‌జ‌న బ్యాచ్‌

మంత్రిగారికి భ‌జ‌న భ‌జంత్రీ బృందం 

అవ‌స‌ర నిమిత్తం భ‌హుకృత వేషం అన్నారు పెద్ద‌లు. కానీ కొంత మంది సినీజ‌నం మాత్రం అవ‌స‌ర నిమిత్తం భ‌జ‌నే స‌మ‌స్తం అన్న‌ట్టుగా త‌యార‌య్యారు. `నో ఎథిక్స్.. ఓన్లీ పాలిటిక్స్..`.. `స్వ‌లాభం సొంత మేలు!` అన్న‌ట్టుగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ జెండా మోయ‌డం.. ఏ మంత్రి సినిమాటోగ్ర‌ఫీ శాఖ‌ని చేప‌డితే ఆ మంత్రిని బుట్ట‌లో వేయ‌డానికి భ‌జ‌న చేయ‌డం ఈ మ‌ధ్య ఓ బ్యాచ్ అల‌వాటు వ్యాప‌కంగా పెట్టుకుంది. పైకి ప‌ర‌సేవ.. లోన త‌ర‌త‌మ సేవ‌! అన్న‌ట్టుగా త‌న ప‌ని తాను చేసుకుపోతోంది. ఇటీవ‌ల త‌మ విభాగానికి సంబంధించిన‌ ఓ మంత్రి గారి పుట్టి రోజు వేడుక‌ల్ని ఘ‌నంగా నిర్వ‌హించిన ఓ భ‌జ‌న బ్యాచ్ అంత‌టితో ఆగ‌క ఆయ‌న‌పై ప్రేమ‌ను ఒల‌క‌బోస్తూ ప్ర‌త్యేకంగా ఓ పాట‌ను కూడా సిద్ధం చేసి ఆయ‌న స‌మ‌క్షంలోనే రిలీజ్ చేసింది.
 
మంత్రిగారి పుట్టిన రోజున ఈ భ‌జ‌న బ్యాచ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. త‌మ భ‌జ‌న‌తో మంత్రిని బుట్ట‌లో వేసుకుని త‌మ ప‌నులు సాఫీగా కానిచ్చేయాల‌నే ఇదంతా చేస్తున్నార‌ని.. స‌ద‌రు మంత్రికి కూడా తెలుసు. అయినా ఎలాంటి అడ్డు చెప్ప‌క‌పోవ‌డంతో వీరి భ‌జ‌గోవింద భ‌జంత్రీ పీక్స్ కి చేరిపోయింది. ఇక్క‌డొక విష‌యం చెప్పుకోవాలి. భ‌జ‌న చేస్తున్న ఈ బ్యాచ్ కొన్ని మంచి ప‌నులు కూడా చేస్తున్నారు. ఆప‌న్నుల‌ను క‌ష్టాల్లో ఆర్థికంగా ఆదుకున్న సంద‌ర్భాలు వున్నాయి. ల‌బ్ధిదారులు సంతోషం వ్య‌క్తం చేశారు కాబ‌ట్టి వీరి ప్ర‌య‌త్నం మంచిదేన‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి.
 
ఇక్క‌డ ఇంకో విష‌యం కూడా చెప్పాలి. తెరాస యంగ్ ఎంపీని ఇప్ప‌టికే బుట్ట‌లో వేసిన ఈ భ‌జంత్రీల బ్యాచ్ ప‌లువురు పెద్ద త‌ల‌కాయ‌ల్ని కూడా బుట్ట‌లో వేయాల‌ని బోలెడ‌న్ని ప్ర‌య‌త్నాలే చేస్తోంది. అయితే ఇలాంటి భ‌జంత్రీ బ్యాచ్ ల వ‌ల్ల టాలీవుడ్ కి మేలు జ‌రిగితే ఓకే. కీడు జ‌రిగితేనే కాస్త జాగ్ర‌త్త ప‌డాలి. పాల‌కుల్నే గుప్పిట ప‌డితే.. వేషం మారిపోతే ఆ ప్ర‌మాదాన్ని అంచ‌నా వేయాల్సి ఉంటుంది. ఇక ఇలాంటి భ‌జంత్రీ బాబులు సినీకార్మికుల పిల్ల‌ల చ‌దువుల కోసం.. ఆరోగ్యం కోసం.. ఏదైనా చేస్తే బావుండేద‌న్న మాటా వినిపిస్తోంది. అవ‌కాశాల్లేక కుటుంబాలు వీధిన ప‌డే ప‌రిస్థితి ఉన్న నిరుపేద క‌ళాకారుల్ని ఆదుకుంటే బావుంటుంద‌ని అందుకోసం భ‌జ‌న భ‌జంత్రీలు చేసిన ఫ‌ర్వాలేద‌ని కొంద‌రు సూచిస్తున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}