fbpx
Home Cinema కింగ్ నాగార్జున‌పై దుష్ఠ‌శ‌క్తుల ప్రభావం

కింగ్ నాగార్జున‌పై దుష్ఠ‌శ‌క్తుల ప్రభావం

అక్కినేని సంబ‌రాలు చూత‌ము రారండి

కింగ్ నాగార్జున‌పైనా.. అక్కినేని హీరోల‌పైనా సోష‌ల్ మీడియా దుష్ప్ర‌చారం తెలిసిందే. సామాజిక మాధ్య‌మాల్లో ఒక సెక్ష‌న్ మీడియా అదే ప‌నిగా అక్కినేనీస్ పై నెగెటివిటీని ప్ర‌చారం చేస్తోంది. దానివ‌ల్ల కింగ్ నాగార్జున తీవ్రంగా హ‌ర్ట‌వుతున్నార‌ని అక్కినేని అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది. ఇదంతా కావాల‌ని కొన్ని దుష్ఠ‌శ‌క్తులు చేస్తున్న ప్ర‌య‌త్న‌మా? అన్న చ‌ర్చా సాగుతోంది. అయితే నెగెటివిటీ రాజ్య‌మేలే సువిశాల రంగుల ప్ర‌పంచంలో నాగార్జున లాంటి స్టార్ హీరోకి ఈ ముప్పు ఇబ్బందిక‌ర‌మే.

కింగ్ సినిమా రిలీజ్ కాక‌ముందే ఇది ఫ్లాప్ అని రాసేయ‌డం లేదా ఈ వ‌య‌సులో ఆ చిలిపి వేషాలేంటి? అని ప్ర‌శ్నించ‌డం వ‌గైరా ఒక సెక్ష‌న్ మీడియా సాగిస్తున్న ద‌మ‌న‌కాండ అనే చెప్పాలి. ఇక నాగార్జున ఎన్నో హోప్స్ పెట్టుకున్న `మ‌న్మ‌ధుడు 2` చిత్రంపై నెగెటివ్ రివ్యూల ప్ర‌భావం గురించి తెలిసిందే. ఈ సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డంలో నెగెటివ్ రివ్యూల ప్ర‌భావం దారుణంగా ప‌డింద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. అయితే ఇటీవ‌ల తెలుగు సినీమీడియాలో ఊహించ‌ని రీతిలో నెగెటివిటీ రాజ్య‌మేలుతోంది. దాని వెన‌క ఏం జ‌రుగుతోంది.. అన్న‌దానిపై చాలా కొద్ది మందికి మాత్ర‌మే స్ప‌ష్ఠ‌త ఉంది. ఈ ప‌రిణామం కేవ‌లం కింగ్ నాగార్జున పైనే కాదు.. ఇత‌ర హీరోల‌పైనా ప‌డుతోంద‌న్న‌ది నిర్వివాదాంశం.

అదంతా అటుంచితే ఆరు ప‌దుల వ‌య‌సుకు చేరువైన నాగార్జున మూడు ద‌శాబ్ధాల పాటు ప‌రిశ్ర‌మ‌లో అగ్ర హీరోగా సేవ‌లందించారు. ఇన్నాళ్ల‌ త‌ర్వాత ఆయ‌న‌పై ఈ దుష్ప్ర‌చారం ఎందుకు? 29 ఆగ‌స్టు నాగార్జున‌ బ‌ర్త్ డే సంద‌ర్భంగా స్పెయిన్ ఇబిజ‌లోని అరుదైన లొకేష‌న్ లో సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. అక్కినేని కుటుంబ స‌భ్యులంతా ఈ వేడుక‌లో పాల్గొన్నారు. నాగార్జున, అమ‌ల‌, నాగ‌చైత‌న్య‌, స‌మంత‌, అఖిల్ త‌దిత‌రులు ఈ వేడుక‌కు ఎటెండ్ అయ్యారు. అయితే నాగార్జున వైర‌ల్ ఫీవ‌ర్ వ‌ల్ల కొంత‌ ఇబ్బంది ప‌డ్డార‌ని తెలిసింది. కానీ ఆ నీర‌సానికి కార‌ణం వేరు అని.. మ‌న్మ‌ధుడు 2 లో యంగ్ లుక్ కోసం తీవ్రంగా శ్ర‌మించ‌డం వ‌ల్ల వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు స‌హా తీవ్ర‌మైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారంటూ ప్ర‌చారం సాగించారు. ఇందులో ఎలాంటి నిజం లేదు మొర్రో! అంటూ నాగార్జున‌నే స్వ‌యంగా అభిమానుల‌కు చెప్పుకోవాల్సి వ‌చ్చిందంటే అర్థం చేసుకోవ‌చ్చు.

ఆరోగ్యంగానే ఉన్నా! కావాలంటే చూస్కోండి!

తాజాగా కింగ్ నాగార్జున ఇబిజ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన కొన్ని ఫోటోల్ని కోడ‌లు స‌మంత షేర్ చేశారు. సామ్ ఇన్‌స్టాగ్ర‌మ్‌ ఆల్బ‌మ్ లో ఫ్యామిలీ ఫోటోతో పాటుగా నాగార్జున ఓ ఈత కొల‌నులో కండ‌లు ప్ర‌ద‌ర్శిస్తున్న ఫ‌న్నీ ఫోటో ఆక‌ర్షిస్తోంది. నేను హెల్తీగానే ఉన్నా! అంటూ త‌న‌పై దుష్ప్ర‌చారం చేసిన‌వాళ్ల‌కు ఇది కౌంట‌ర్ అని భావించాల్సి ఉంటుందేమో!

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}