Home Cinema బాహుబ‌లి టాయ్స్ విదేశాల్లో ఇంకా గిరాకీ

బాహుబ‌లి టాయ్స్ విదేశాల్లో ఇంకా గిరాకీ

భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో `బాహుబ‌లి` స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖించిన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ సినీ య‌వ‌నిక‌పై భార‌తీయ సినిమా స‌త్తాను చాటి స‌రికొత్త‌ రికార్డుల్ని బ్రేక్ చేసింది. రెండు భాగాలు కూడా ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న సినీ ప్రేమికుల్ని అబ్బుర ప‌రిచాయి. క‌ట్ట‌ప్ప‌ బాహుబ‌లిని ఎందుకు చంపాడు? అనే ట్విస్ట్‌తో తొలి భాగాన్ని ముగించ‌డం, రెండ‌వ భాగంలోనే అస‌లు క‌థ‌ని అంతా చెప్ప‌డం, రోమాంచిత‌మైన యాక్ష‌న్ ఘ‌ట్టాలు వంటి స‌న్నివేశాల కార‌ణంగా రెండు భాగాలు దేనిక‌దే ప్ర‌త్యేక‌త‌ను చాటాయి.

సాహో టాయ్స్ రిలీజ్ చేస్తారా?

ఈ సినిమాకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఏర్ప‌డిన క్రేజ్‌ని గ‌మ‌నించిన చిత్ర బృందం దాన్ని క్యాష్ చేసుకోవ‌డం కోసం `బాహుబ‌లి` టాయ్స్‌, వ‌ర్చువ‌ల్ గేమ్స్ అంటూ ప‌లు క్యారెక్ట‌ర్ల‌తో గేమ్స్‌ని, టాయ్స్‌ని మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. బాహుబ‌లి పాత్ర‌తో పాటు భ‌ల్లాల దేవ పాత్ర‌కు కూడా అంతే క్రేజ్ వుండ‌టంతో ఇద్ద‌రి టాయ్స్ కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్ప‌డింది. వీటికి జపాన్‌లో భారీ క్రేజ్ ఏర్ప‌డ‌టంతో అక్క‌డ బాహుబ‌లి టాయ్స్ హంగామా మామూలుగా లేదు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి ట్విట్టర్‌లో వైర‌ల్‌గా మారింది. ఓ సూప‌ర్ మార్కెట్‌లో బాహుబ‌లి టాయ్స్‌ని పేర్చిన ట్రేలు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి. సినిమా రిలీజై ఏళ్లు గ‌డుస్తున్నా జ‌పాన్ స‌హా ఇటలీ, పోర్చుగ‌ల్ లాంటి చోట్ల ఇంకా బాహుబ‌లి క్రేజ్ త‌గ్గ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. ఇటీవ‌లే సాహో రిలీజైంది. ఈ సినిమాని జ‌పాన్ స‌హా విదేశాల్లో రిలీజ్ చేస్తే అక్క‌డ మ‌రోసారి ప్ర‌భాస్ ముఖ‌విలువ‌ను ఉప‌యోగించి టాయ్స్ బిజినెస్ కి తెర‌తీస్తారేమో చూడాలి.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ