Home Cinema టాలీవుడ్ `క‌మిట్‌మెంట్`పై సినిమా.. ట్రీట్‌కి రెడీనా?

టాలీవుడ్ `క‌మిట్‌మెంట్`పై సినిమా.. ట్రీట్‌కి రెడీనా?

`క‌మిట్‌మెంట్` దెబ్బ‌కు టాలీవుడ్ గోల్ మాల్

వ‌ర్క్ ప్లేస్ లో లైంగిక వేధింపుల వ్య‌వ‌హారంపై మీ-టూ ఉద్య‌మం హీటెక్కించిన సంగ‌తి తెలిసిందే. హాలీవుడ్ .. బాలీవుడ్ .. టాలీవుడ్ అనే తేడా లేకుండా స‌ర్వ‌త్రా వేడి పెంచిన టాపిక్ ఇది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కూ ఈ ఉద్య‌మం ప్ర‌భావం అంతా ఇంతా కాదు. టాలీవుడ్ బిగ్ బీల‌కు ఈ సెగ ఆందోళ‌న క‌లిగించింద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. దొరికిన వాడు దొంగ.. దొర‌క‌ని వాడు దొర‌! అన్న చందంగా ఎక్క‌డివాళ్లు అక్క‌డ గ‌ప్ చుప్ గా వ్య‌వ‌హ‌రించారు. ఆ గ‌డ‌బిడ అనంత‌రం తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో అడుగుడుగునా ఏ ఆఫీస్ కి వెళ్లినా మ‌హిళా ఆర్టిస్టుల‌ సంర‌క్ష‌ణ గురించి బోర్డులు వెలిశాయి. ఆ బోర్డులు నీతులు వ‌ల్లించాయి. క‌మిట్ మెంట్ అన్న‌ది నేర‌మ‌ని.. అలాంటి వాటికి త‌మ సంస్థ‌లు ప్రోత్స‌హించ‌వ‌ని ఆ బోర్డుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

అయితే మీటూ ఉద్యమం ఎంత విస్త్ర‌తంగా దూసుకెళ్లినా టాలీవుడ్ నుంచి బిగ్ షాట్స్ ఎవ‌రూ దీనిపేరుతో బుక్ అయ్యిందేమీ లేదు. అప్ప‌ట్లో న‌టి శ్రీ‌రెడ్డి ఎటాక్ మొద‌లు ప‌లువురు న‌టీమ‌ణులు కొంద‌రు ప్ర‌ముఖుల‌పై ఆరోపిస్తూ మీడియాకెక్కిన సంగతి తెలిసిందే. ఈ వేధింపుల ఆరోప‌ణ‌ల్లో కొన్ని పేర్లు వినిపించినా.. గ‌త ఏడాది అమెరికా లెవ‌ల్లో అతిపెద్ద సెల‌బ్రిటీ వేధింపుల చెయిన్ గుట్టు ర‌ట్ట‌యినా.. పోలీస్ వ్య‌వ‌స్థ‌లు కానీ.. కోర్టులు కానీ ఏమీ చేయ‌లేక‌పోయాయ‌న్న‌ది బ‌హిరంగ చ‌ర్చ‌కు తావిచ్చింది.

అయితే ఈ వేధింపుల‌పై ఎవ‌రైనా సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఆలోచ‌న వ‌చ్చిందే త‌డ‌వుగా హైద‌రాబాద్ న‌వాబ్స్ ఫేం ల‌క్ష్మీకాంత్ చెన్నా స్క్రిప్టు రెడీ చేశార‌ట‌. లేటెస్టుగా `క‌మిట్ మెంట్` అంటూ టైటిల్ పోస్ట‌ర్ ని రిలీజ్‌ చేశారు. స‌మాజంలో జ‌రుగుతున్న ఓ నిజం! అనేది ఉప‌శీర్షిక‌. నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు.  ఎఫ్ 3 ప్రొడ‌క్ష‌న్స్, ఫుట్ లూజ్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఒక బెడ్ దాని ప‌క్క‌నే విప్పేసిన మ‌గువ లోదుస్తులు.. షూ.. చెప్పులు క‌నిపించాయి ఈ పోస్టర్‌లో. లుక్ బావుంది. అయితే కంటెంట్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా? ఇందులో టాలీవుడ్‌లో తాను చూసిన‌వి ఏవైనా ద‌ర్శ‌కుడు చూపిస్తున్నారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇంకా కాస్టింగ్ వివ‌రాలు రివీల్ చేయాల్సి ఉంది.

 

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ