fbpx
Home Cinema యంగ్ బ్యూటీకి అదే శాపంగా మారిందా?

యంగ్ బ్యూటీకి అదే శాపంగా మారిందా?

అక్క‌డ హిట్.. ఇక్క‌డ ఫ‌ట్‌..

అమెరికా నేప‌థ్యం ఉన్న‌ మ‌ల‌యాళీ భామ అను ఇమ్మాన్యుయేల్‌ 22 వ‌య‌సుకే తెరంగేట్రం చేసింది. మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `ప్రేమ‌మ్‌` ఫేమ్ నివిన్ పాళీ న‌టించిన `యాక్ష‌న్ హీరో బీజు`తో అను సినీ ప్ర‌యాణం మొద‌లైంది. మూడేళ్ల జ‌ర్నీలో అను చాలా త‌క్కువ స‌మ‌యంలోనే అగ్ర క‌థానాయ‌కుల స‌ర‌స‌న‌ న‌టించింది. తెలుగులో ప‌వ‌న్‌క‌ల్యాణ్ తో `అజ్ఞాత‌వాసి`, అల్లు అర్జున్‌తో `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`, నానితో `మ‌జ్ను`, గోపీచంద్‌తో `ఆక్సిజన్‌`, నాగ‌చైత‌న్య‌తో `శైల‌జారెడ్డి అల్లుడు`, రాజ్ త‌రుణ్‌తో `కిట్టు వున్నాడు జాగ్ర‌త్త‌` వంటి చిత్రాల్లో న‌టించింది.

అనూ.. ఇదంతా పూర్వ జ‌న్మ సుకృతం

అయినా అవేవీ అను కెరీర్‌ని స‌క్సెస్ బాట ప‌ట్టించ‌లేక‌పోయాయి. ప్ర‌స్తుతం త‌మిళంలో శివకార్తికేయ‌న్ న‌టిస్తున్న `న‌మ్మ‌వీట్టు పిళ్లై` చిత్రంలో న‌టిస్తోంది. చేతిలో సినిమాలు పెద్ద‌గా లేక‌పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం అనూకి భారీ ఫాలోయింగ్ వుంది. తెర‌పై కృత్రిమంగా క‌నిపించినా సోష‌ల్ మీడియాలో మాత్రం అను ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపిస్తుంటుంది. ఇదే ఆమెకు అభిమానుల్ని పెరిగేలా చేస్తోంది. ఇప్పుడామెని ఇన్‌స్టాలో సుమారు 10లక్ష‌ల మంది ఫాలో అవుతున్నారు. ఇక్క‌డ ఫ‌ట్ అనిపించుకున్నా అను అక్క‌డ మాత్రం హిట్ అవుతుండ‌టం ఆశ్చ‌ర్య‌మే. అంతేకాదు.. కెరీర్ ఆరంభ‌మే యువ‌క‌థానాయ‌కుల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకున్న అనూకి అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించ‌డ‌మే పెద్ద శాపంగా మారింది. బ‌డా స్టార్ల స‌ర‌స‌న న‌టించిన సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్లుగా నిల‌వ‌డంతో అది కాస్తా త‌న కెరీర్ పై ప్ర‌భావం చూపించింది. ముఖ్యంగా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న అజ్ఞాత‌వాసి, నా పేరు సూర్య డిజాస్ట‌ర్లు అవ్వ‌డం కెరీర్ కి పెద్ద మైన‌స్ అయ్యింది.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ